పదిశాతం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీ ఏమన్నారంటే..

స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ రిజర్వేషన్‌ కల్పనపై రాజకీయాలు చేస్తుందని భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్ల కోసం సీఎం కేసీఆర్‌ ఏనాడో గళమెత్తారన్నారు. బీజేపీ రాష్ట్రంలో రిజర్వేషన్లపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌లను తెరపైకి తెచ్చిందన్నారు. పేదలకు పదిశాతం రిజర్వేషన్ల కల్పనపై బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ల కల్పనపై వెసులుబాటు కల్పించాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సమరంలో గ్రామీణ ప్రగతి లక్ష్యంగా ప్రజలు రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకు ఘన విజయం అందించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందన్నారు. జనగామలోని వీవర్స్‌కాలనీ వద్ద రైల్వేలైన్‌పై అండర్‌పాస్‌ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ కూడా ఖరారైందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జి.ప్రేమలతారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, నాయకులు చింతల మల్లికార్జున్‌, పసుల ఏబేలు, కొమ్మరాజు, రావెల రవి, మామిడాల రాజు, ఉల్లెంగుల కృష్ణ, ఉడుగుల కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

దళిత సంఘాల మెమోరాండం
జనగామలోని హన్మకొండ రూట్‌లో అంబేద్కర్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు అం బేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత సంఘాలు మెమోరాండం అందించాయి. కార్యక్రమంలో డాక్టర్‌ రాజమౌళి, బొట్ల శ్రీనివాస్‌, ఉడుగుల రమేష్‌, శివశంకర్‌ పాల్గొన్నారు.