ఆచంట పితానిదే…. అక్క‌డ ఎగిరేది టీడీపీ జెండాయే..!

అవును! ప‌నిచేసే నాయ‌కుడికి ప్ర‌జ‌లు ఎప్పుడూ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి పితాని స‌త్య నారాయ‌ణ‌కు విజ‌యం మ‌ళ్లీ ఖాయ‌మైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అజాత శ‌త్రువుగా పేరు తెచ్చుకున్న పితానికి పార్టీల‌కు అతీతంగా అభిమానులు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న గ‌తంలో కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఆ స‌మ‌యంలో 2009లో ఆచంట నుంచి పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, అప్ప‌ట్లో వైఎస్ హ‌వా బాగా సాగింది కాబ‌ట్టి పితాని విజ‌యం సాధించార‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు.

ఈ విష‌యంలో ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌డం మానేసి ప‌నితీరుతోనే స‌మాధానం చెప్పాల‌ని భావించిన పితాని.. త‌న ప‌నితీరు ను మ‌రింత మెరుగు ప‌రుచుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. అన్ని వ‌ర్గాల‌కు ఆయ‌న చేరువ అయ్యారు. ప్ర‌తి ఒక్క రినీ క‌లుసుకోవ‌డం స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేలా చూసుకోవ‌డం వంటివి ఆయ‌న‌కు ప్ల‌స్‌లుగా మారాయి. అదేవిధంగా పార్టీలోని కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుపుకొని పోవ‌డం, ప్ర‌తి ఒక్క‌రితోనూ గౌర‌వంగా మాట్లాడ‌డం, వారికి కూడా అందుబాటులో ఉండ డం వంటివి ఆయ‌న‌కు మ‌రింత క‌లిసి వ‌చ్చాయి. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌నిన‌మ్మే సుగుణం పితాని సొంతం. అంత మాత్రాన ఆయా విమ‌ర్శ‌లను హ‌ద్దు మీరేలా కాకుండా విమ‌ర్శ‌ల‌ను కూడా ప‌ది మంది ఆహ్వానించేలా ఆయ‌న చేసేవారు త‌ప్పితే.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చేవారు కాదు.

ఇక‌, మంత్రిగా చేసినా.. సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా నియోజ‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికీ.. కాలిన‌డ‌క‌న వెళ్ల‌డం ఆయ‌న‌కు అత్యంత ఇష్టం. ఈ నేప‌థ్యమే.. త‌ర్వాత ఎన్నిక‌ల్లో పితాని పార్టీ మారి టీడీపీలోకి చేరి తిరిగి ఆచంట నుంచే పోటీ చేసినా…ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దాదాపు 3 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆయ‌న‌కు 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కార్మిక శాఖ మంత్రిగా అవ‌కాశం క‌ల్పించారు. దీంతో మంత్రిగా పితాని దూసుకుపోయారు. కార్మికుల‌కు అత్యంత కీల‌క‌మైన చంద్ర‌న్న బీమా విస్తృతంగా ప్ర‌చారం చేయించారు. ప్ర‌తి ఒక్క‌రూ దీనిలో బాగ‌స్వాములు అయ్యేలా ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వం నుంచి అందే ప్ర‌తి ఫ‌లాన్ని కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. ఇలా మొత్తానికి ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న నినాదం అంద‌రికీ అభివృద్ది! ఇదే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆచంటలో మ‌రోసారి పితాని గెలిచేందుకు దోహ‌ద‌ప‌డ‌నుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆచంట నుంచే హ్యాట్రిక్‌కు రెడీ అవుతోన్న పితాని దూకుడుతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి స‌రైన క్యాండెట్ కూడా లేని ప‌రిస్థితి.