ఆదిరెడ్డి.. ప్ర‌తి ఇంటి త‌లుపు త‌ట్టి.. ఎన్నిక‌ల్లో స‌రికొత్త స‌ర‌ళికి శ్రీకారం

ఎన్నిక‌ల వేడి భారీ ఎత్తున సెగ‌లు పుట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్రచారం జోరుమీదుంది. ఎక్క‌డిక‌క్క డ నాయ‌కులు దూసుకుపోతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతున్నారు. త‌మ త‌మ ప్రాధాన్యాల‌ను వివ‌రిస్తున్నారు. ప్ర‌తి విష‌యంపైనా క్లారిటీగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే రాజ‌మండ్రి న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆదిరెడ్డి భ‌వానీ కూడా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ప్ర‌తి ఇంటినీ ప‌ల‌క‌రిస్తున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల ప్ర‌చారంలో చాలా మంది నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నా.. స‌హ నంగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కాలేక పోతున్నారు. వివిధ కార‌ణాల‌తో వారు ప్ర‌జ‌ల‌తో అంటీ ముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రి స్తున్నారు.

అయితే, ఆదిరెడ్డి భ‌వానీ మాత్రం చాలా ఓపిక‌గా.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. వారి క‌ష్టాల‌ను తెలుసుకుంటున్నారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లి.. త‌లుపు త‌ట్టి ఆ ఇంట్లోని మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు కూడా వేచి ఉండి వారిని ఓటు అభ్య‌ర్థిస్తు న్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ఫ‌లాల‌పై ఆరాతీస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా ఉండేందుకు ఉన్న మార్గాల‌ను కూడా తెలుసుకుంటున్నారు. స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడుతున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను ఖ‌చ్చితంగా ప‌రిష్క‌రిస్తాన‌నే న‌మ్మ‌క‌మైన భ‌రోసా క‌ల్పిస్తున్నారు. వృద్ధులు, విక‌లాంగుల‌ను కూడా క‌లుస్తూ.. వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు.

దీంతో రాజ‌మండ్రి న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డాలేని విధంగా టీడీపీ రేటింగ్ పెరుగుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ ఆదిరెడ్డికి జై కొడుతున్నారు. త‌మ‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించే నాయ‌కురాలిగా ఆమెపై విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల వారినీ క‌లుపుకొని పోతున్నారు. కులాలు, మ‌తాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రితోనూ ముందుకు సాగుతూ.. ప్ర‌జ‌ల్లో త‌నూ ఒక మ‌నిషిన‌ని, గెలిపిస్తే.. రాజ‌మండ్రిలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని అభ‌యం ఇస్తున్నారు. గ‌తానికి భిన్నంగా ఆదిరెడ్డి నిర్వ‌హిస్తున్న ప్ర‌చానికి ప్ర‌జ‌ల నుంచి కూడా అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. త‌మ ఓటుఖ‌చ్చితంగా మా ఇంటి ఆడుప‌డుచుకే అంటూ.. మ‌హిళ‌లు హార‌తులు ఇచ్చి. తిల‌కాలు దిద్ది భ‌రోసా నింపుతుండ‌డం గమ‌నార్హం.

యువ మ‌హిళా రాజ‌కీయ వార‌సురాలిగా క్లీన్ ఇమేజ్‌తో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన భ‌వానీకి మ‌హిళ‌ల్లో అదిరిపోయే స్పంద‌న వ‌స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కంటే మ‌హిళ‌ల ఓట్లు ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం ఆమెకు ప్ల‌స్ పాయింట్‌. ఇటు పార్టీ సంప్ర‌దాయ ఓటు బ్యాంకుతో పాటు అటు ఆదిరెడ్డి ఫ్యామిలీ ఓటు బ్యాంక్‌, మ‌హిళ‌లు ఆమె వైపే ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి భ‌వానీ భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.