ఆ నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు

కాంగ్రె‌స్‌కు రెబెల్స్‌గా మారి విప్‌ను సైతం ఉల్లంఘించిన నలుగురిపై వేటుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచన మేరకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ సీఎల్పీ నేత సిద్దరామయ్య విప్‌ను ఉల్లంఘించిన నలుగురిపైన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

ఇటీవల గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ సమావేశాలకు వారికి విప్‌ను జారీ చేసినా హాజరు కాలేదని వారు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారని కనుక వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విన్నవించారు. ఎమ్మెల్యేలు ఉమేశ్‌జాధవ్‌, మహేశ్‌ కుమటహళ్ళి, నాగేంద్ర, రమేశ్‌ జార్కిహొళిలపై చర్యతీసుకోవాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు పరిశీలన జరుపుతానని స్పీకర్‌ హామీ ఇచ్చారు. సిద్దరామయ్య వెంట డీసీఎం పరమేశ్వర్‌, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌గుండూరావు ఉన్నారు.