ఐదారు రోజుల్లో కేబినెట్‌ విస్తరణ

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా పెదవి విప్పారు. రాబోయే ఐదారు రోజుల్లో విస్తరణ ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. హైదరాబాద్‌ భవిష్యత్తు ప్రణాళికలపై శనివారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ సందర్భంగా విస్తరణపై కేసీఆర్‌ మొదటిసారిగా మాట్లాడారు. ఐదారు రోజుల్లో ఉంటుందని చెప్పారు. అయితే, ఈనెల 17న కేసీఆర్‌ పుట్టిన రోజు. దాంతో, దానికి ముందుగానీ తర్వాత గానీ ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.