ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం చంద్రబాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జగన్‌ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీకి బాబు లేఖ రాశారు. కోడి కత్తి కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి ఎలా వస్తుందని నిలదీశారు. ఫెడరల్‌ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా బాబు ప్రస్తావించారు. టెర్రరిస్టుల చర్యలు అదుపులోకి పెట్టేందుకు జాతీయ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న కేంద్రం, రాష్ట్రాల హక్కులను హరించివేస్తోందని మోదీ చేసిన వ్యాఖ్యలను లేఖలో బాబు పేర్కొన్నారు. అలాగే 2011లో లక్నోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్‌ఐఏకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశాన్ని బాబు లేఖలో ప్రస్తావించారు.