ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఈసీ టీమ్ షాక్

ఏపీ రాజకీయాలుసంచలనంగా మారాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ డీజీపీ పైనా కంప్లయింట్ ఇచ్చింది. ఎన్నికల సంఘం దానిపై విచారణ జరిపింది. డీజీపీ ట్రాక్ రికార్డ్ బాగుందని.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏపీ డీజీపీ వాహనాన్నే తనిఖీ చేయడంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎస్ కోట మండలం బొడ్డవరం జంక్షన్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. అదే మార్గంలో అరకు వెళ్తున్న ఏపీ డీజీపీ వాహనాన్ని ఆపారు. ఆయన వెహికల్ ను కూడా తనిఖీ చేశారు. దీంతో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్.. ఏపీ డీజీపీకే షాక్ ఇచ్చినట్లయింది. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది.