ఏపీలో టీడీపీ దూకుడు .. భారీగా పెరుగుతున్న మద్దతు

అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి ఊహించని మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి జామాయిత్‌ ఇస్లామిక్‌ హింద్‌ మద్దతు ప్రకటించగా.. తాజాగా ఏపీ యాదవ మహాసభ కూడా టీడీపీకి మద్దతు ప్రకటించింది. మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమవారం సీఎంతో భేటీ అయ్యారు.

రాజధానిలో 10 ఎకరాల భూమిని, యాదవ సంక్షేమ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని యాదవ మహాసభ కోరింది. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాలకొండయ్య, ప్రధాన కార్యదర్శి తులసీరామ్‌, కోశాధికారి బాలయ్య యాదవ్‌ సీఎంను కలిశారు.