బిగ్‌బాస్-3’ పార్టిసిపెంట్స్ ఎవరంటే…

బిగ్‌బాస్’ తెలుగులోకి కూడా ప్రవేశించి ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. అయితే రెండో సీజన్లో మాత్రం ఒకరిద్దరు తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసిన సెలబ్రిటీలు ఎవరూ లేరు. ఈ షోపై బాగా వివాదాస్పదమైంది. అయితే ఈసారి ఎలాంటి వివాదాలకూ.. ఆరోపణలకు తావు లేకుండా ‘బిగ్‌బాస్’ యాజమాన్యం జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.

ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ లిస్ట్ ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘‘రేణు దేశాయ్, గద్దె సిందూర, శోభిత ధూళిపాల, వరూణ్ సందేశ్, ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, జబర్దస్త్ నరేష్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ ‘మహాతల్లి’ ఫేమ్ జాహ్నవి’’ ఉన్నారు. అయితే, వీరంతా ఫైనల్‌గా ‘బిగ్‌బాస్ 3’లో ఉంటారా లేదంటే.. ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా వేరే వారిని తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సస్పెన్స్ మొత్తానికి త్వరలోనే తెర పడుతుంది.