‘బిగ్‌బాస్-3’ హోస్ట్‌ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ సీజన్-3కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పార్టిసిపెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే వారిలో ఎవరుంటారు? ఎవరుండరు? అనే విషయాల్లో స్పష్టత అయితే లేదు. ఇకపోతే ఇప్పుడు నడుస్తున్న పెద్ద చర్చ ఏంటంటే.. ‘బిగ్‌బాస్-3’కి హోస్ట్ ఎవరు? చిరంజీవి అని కొందరు.. వెంకటేష్ అని మరికొందరు గెస్ కొట్టారు. కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

ఎన్టీఆర్ సారథ్యంలో బిగ్‌బాస్ సీజన్-1 ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ షో రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం సీజన్ -3కి హోస్ట్‌గా ఎన్టీఆర్‌ను తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ మేరకు ఆయనను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలమయ్యయట. ఎన్టీఆర్ సీజన్-3 చేసేందుకు ఒప్పుకున్నాడట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌లో యంగ్ టైగర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారని సమాచారం.