బ్రేకింగ్: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఇప్పటికే డ్వాక్రా మహిళలు, మహిళా ఉద్యోగుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు 50 ఏళ్ల నుంచే వృద్ధాప్య ఫించన్ ఇవ్వనున్నట్లు సర్కార్ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకూ ఉన్న 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు లబ్దిదారులు వివరాలు నమోదు చేయాలని ఎంపీడీవోలకు జారీ చేసిన ఆదేశాల్లో సెర్ప్ స్పష్టం చేసింది. కాగా ప్రభుత్వ ప్రకటనతో గిరిజనులు ఆనందంలో మునిగితేలుతున్నారు.