వైఎస్ షర్మిలకు అండగా విజయశాంతి..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి… వైఎస్ షర్మిలకు అండగా నిలిచారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలే రాజకీయాల్లో మహిళను అణగదొక్కుతూ, వారిని వేధిస్తూ పురుషాధిక్యత చాటుకునే […]

జగన్, కేటీఆర్ భేటీపై స్పందించిన టీడీపీ

సీఎం కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాల్లో భాగంగా బుధవారం ఆయన తనయుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్..హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌తో భేటీకానున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్ జగన్‌తో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో బోండా ఉమ మాట్లాడుతూ ‘‘ ఏపీలో టీడీపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్‌, కేసీఆర్‌ డైరెక్షన్‌లో జగన్‌ పనిచేస్తున్నారు. ముసుగు రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నారు. ఫెడరల్‌ […]

బీజేపీకి భారీ ఎదురు దెబ్బ… మమత బెనర్జీకి భారీ విజయం…

పశ్చిమ బెంగాల్‌లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ రథయాత్రల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కేవలం బహిరంగ సభల నిర్వహణకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రథయాత్రలకు సవరించిన ప్రణాళికను సమర్పించాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయం ముఖ్యమంత్రి మమత బెనర్జీకి గొప్ప విజయంగా చెప్పవచ్చు. బీజేపీ రథయాత్రల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తూ, మమత ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. […]

కేసీఆర్‌ ప్రచారం చేస్తే టీడీపీకి 160 సీట్లు ఖాయం

మోదీపై దేశ ప్రజలు ఎప్పుడో నమ్మకం కోల్పోయారని ఎంపీ కేశినేని నాని అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ దేశంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌, అనుకూల ఫ్రంట్‌ మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఓ కిచిడీ ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు.ఫెడరల్‌ ఫ్రంట్‌ తరపున జగన్‌తో చర్చలు నిష్ప్రయోజనమన్నారు. ఏపీలో టీడీపీకి 130 సీట్లు రావడం ఖాయమని… అయితే జగన్‌ తరపున కేసీఆర్‌ ప్రచారం చేస్తే టీడీపీకి 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ […]

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

తెలంగాణలో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ బుధవారం బులిటెన్‌ను విడుదల చేశారు. పార్టీ ఫిరాయింపుల పై ఫిర్యాదు అందడంతో ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, రాములు నాయక్, భూపతి రెడ్డిల సభ్యత్వాలను శాసనమండలి చైర్మన్ రద్దు చేశారు. గవర్నర్ కోటాలో రాములు నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా యాదవరెడ్డి ఎన్నికవగా, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో […]

కేటీఆర్‌ ఫైనల్ గా చెప్పింది ఇదే..?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తదుపరి చర్చలు జరుపుతామని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ… ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేటీఆర్‌తో చర్చించామన్నారు. తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించామని, ప్రత్యేక హోదాపై ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రశ్నిస్తే అన్యాయం చేయకుండా కేంద్రం వెనకడుగు వేసే అవకాశం ఉంటుందని జగన్ అన్నారు. […]

సంక్రాంతి బరిలో కత్తులు దూస్తున్న పవన్‌, జగన్‌

వైసీపీ, జనసేన అధినేతలు రాజకీయపు పందెపు కోళ్లై మాటల కత్తులు దూస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నాలుగేళ్లకోసారి కార్లు మార్చినంత సులువుగా భార్యలను మార్చేస్తారు’ అంటూ గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చేసిన ఆరోపణల పై చల్లారని అగ్నిపర్వతమై పవన్‌ రగులుతున్నారు. తనపై వ్యక్తిగత విమర్శలతో చేసిన దాడికి ప్రతిగా పదునైన రాజకీ య విమర్శలతో, సమయానుకూలంగా దాడికి చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి వేడుకల్లో జనసేనాని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ […]

ఎన్నికల ముందు ఈ వివాదాలేంటి.. చంద్రబాబు అసహనం!

విజయవాడ : పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, సబ్‌ కలెక్టర్‌ మిషాసింగ్‌ మధ్య పుల్లేరు వాగుల అక్రమ మట్టి తవ్వకం వివాదం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల జోక్యంతో సద్దుమణిగింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ రైతుల తరఫున రూ.లక్ష జరిమానా చెల్లించడంతోపాటు పొక్లెయినర్‌ను కూడా అధికారులకు అప్పగించడంతో వివాదం పరిష్కారమైందని చెబుతున్నారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వివరణ పుల్లేరు వివాదంపై మీడియాలో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో […]

నేడు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరికొద్దిసేపట్లో తన స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకోనున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని ఆయన కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తుల మధ్య జరుపుకోనున్నారు. ఉదయం 8.45కి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొనున్న చంద్రబాబు… అనంతరం 11.30గంటలకు కాశిపెంట్లలోగల హెరిటేజ్ పరిశ్రమలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత 12గంటలకు నారావారిపల్లెకు చేరుకోనున్నారు. రెండురోజులపాటు చంద్రబాబు అక్కడే ఉంటారు. కాగా… ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి తదితరులు నిన్న సాయంత్రమే నారావారిపల్లెకు చేరుకున్నారు. […]