టీఆర్ఎస్‌లో చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమన్నారంటే…

పార్టీని వీడేదిలేదని, జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, పోదెం వీరయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘కారెక్కుతారా..’ అనే కథనం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో స్పందించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. తాము కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచామని, కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం మేరకే పని చేస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారని, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అందు కోసం ప్రతీ […]

వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరావు? పోటీ అక్కడినుంచే

రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారసుడిగా ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నారు. పర్చూరు అసెంబ్లీ నియజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి కూడా ఆయన సిద్ధమైనట్లు సమాచారం. కొద్ది నెలలుగా వైసీపీ నాయకులు దగ్గుబాటి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని ఆ పార్టీ ఉన్నత శ్రేణి నాయకులు చెప్తుండగా దగ్గుబాటి, ఆయన కుమారుడి ఫొటోలతో వైసీపీ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, వాటిని సోషల్‌ […]

వైఎస్‌ జగన్‌తో విష్ణు భేటీ.. ఇడుపులపాయలో ఏకాంత చర్చలు

నెల్లూరు: కావలి రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఆదివారం జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి , వైసీపీ అధినేత జగన్‌తో ఇడుపుల పాయలో ఏకాంతంగా చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో తన టిక్కెట్టు విషయమై సంప్రదించారు. వారిద్దరి మధ్య అంతర్గతంగా జరిగిన చర్చల సారాంశం ఏమిటో స్పష్టంగా తెలియదు కాని, ఈ భేటీకి సంబంధించి కావలి నియోజక వర్గంలో రకరకలా ప్రచారాలు ఊపందుకున్నాయి. మరోవైపు.. కావలి కేంద్రంగా ఆదివారం మధ్యాహ్నం మరో […]

జనసేనను అశ్చర్యపరుస్తూన్న పవన్ అప్తుడు

సినీ నటుడు అలీ ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ అవుతున్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన వెంటనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కూడా భేటీ అయ్యారు. వీరిద్దరిని అలీ కలవడం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదిఇలావుంటే సంక్రాంతి వేడుకల్లో జనసేన నేతలతో సినీ నటుడు అలీ పాల్గొని మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీలకు అలీ, జనసేన నేతలు హజరైనారు. ఇటీవల అలీ అమరావతిలో […]

కొడాలి నానిపై మండిపడ్డ టీడీపీ నేత

‘నానీ నోరు అదుపులో పెట్టుకో.. రోజులు లెక్కపెట్టుకోవాల్సింది నువ్వే.. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడించడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడుతున్న సీఎం చంద్రబాబును నువ్వా విమర్శించేది. దమ్ముంటే రా.. గుడివాడలో తేల్చుకుందాం.’ అంటూ టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు శనివారం వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నానిపై మండిపడ్డారు. విజయవాడలో శుక్రవారం ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రతిగా గుడివాడలోని శోభనా కాన్ఫరెన్స్‌ హాల్లో టీడీపీ […]

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

అశ్వారావుపేట మేజర్‌ పంచాయతీకి సర్పంచ్‌ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతులో బాణోతు పద్మావతి శనివారం నామినేషన్‌ వేసారు. ఆమె 2009, 2018 ఎన్నికలలో అశ్వారావుపేట అసెంబ్లీకీ పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. రేణుకా చౌదరి అనుచరురాలిగా అసెంబ్లీకి పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూసినా పొత్తుల్లో భాగంగా అశ్వారావుపేట సీటును టీడీపీకి కేటాయించడంతో ఈమెకు పోటీ చేయడానికి అవకాశం రాలేదు. తాజాగా ప్రకటించిన పంచాయతీ ఎన్నికలల్లో అశ్వారావుపేట మేజర్‌ పంచాయతీని ఎస్టీలకు కేటాయించడంతో పద్మావతి సర్పంచ్‌ అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ […]

కూటమి ఓటమికి కారణం అదే…కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ పగ్గాలు తనకు అప్పగించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించేవాడినని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు పొత్తు పేరుతో మూడు నెలలు కాలయాపన చేయడం, బలం లేకున్నా మిత్రపక్షాలకు సీట్లు కట్టబెట్టడం వల్లే ఓటమి పాలయ్యామని అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు మినహా మిగిలిన సీట్లలో మిత్రపక్షాల అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీ నాయకత్వంపై తాను […]

‘మాయావతే మా ప్రధానమంత్రి అభ్యర్థి’

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతే తమ ప్రధానమంత్రి అభ్యర్థని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సూచనప్రాయంగా శనివారంనాడు తెలిపారు. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్‌పీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నట్టు అఖిలేష్ యాదవ్, మాయవతి ఇవాళ సంయుక్త మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతికి మద్దతిస్తారా అని అఖిలేష్‌ను అడిగినప్పుడు ‘పలువురు ప్రధాన మంత్రి అభ్యర్థులను దేశానికి అందించిన చరిత్ర ఉత్తరప్రదేశ్‌కు ఉంది. పీఎం అభ్యర్థిగా నేను ఎవరికి […]

రెండు పార్టీల నేతలపై స్పెషల్ ఫోకస్

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో నెలరోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే ప్రధాన అంశంగా ఢిల్లీలో కీలక చర్చ సాగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సూచన మేరకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కీలక నేతలంతా ఢిల్లీ చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం అమిత్‌షా రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో నెలరోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే ప్రధాన అంశంగా ఢిల్లీలో కీలక చర్చ సాగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా […]

ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుల్లేవ్?

తెలంగాణలో కలిసి పోటీ చేసినా.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నా.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ, కాంగ్రెస్‌ వేర్వేరుగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల స్వరంలో వస్తున్న మార్పే ఇందు కు కారణం! అయితే, పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇతర రాష్ర్టాల పరిస్థితి ఎలా ఉన్నా… ఆంధ్రలో పరిస్థితి భిన్నంగా ఉందని రాష్ట్ర […]