చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్నస్వామి ఆలయంలో బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ సభ్యులు ఆదివారం పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు హాయంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు పోతోందన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు.