చంద్రబాబు సీరియస్ వార్నింగ్

ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తన దగ్గర రౌడీయిజం చేసేందుకు వైఎస్‌కే చేతకాలేదని, రౌడీల తోక కట్‌ చేస్తానని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 24 బాంబులేసినా తాను భయపడలేదని, ప్రజల రక్షణ కోసం తాను దేనికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

రౌడీలు వస్తే మహిళలకు రక్షణ, భద్రత ఉండదని బాబు ప్రజలను అప్రమత్తం చేశారు. ఒకాయన చంపడమో… చావడమో అంటున్నారని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటివారిని విడిచిపెట్టేది లేదని, జైలులో పెడతామని ఆయన స్పష్టం చేశారు. రౌడీలకు రౌడీగానే ఉంటానని చంద్రబాబు చెప్పారు.