చంద్రబాబు సంచలన నిర్ణయం

పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఇన్‌చార్జ్‌ వ్యవస్థను రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. గెలవకపోయినా నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించ వచ్చనుకునేవారికి చెక్ పెట్టేందుకే ఇన్‌చార్జ్‌ వ్యవస్ధను రద్దు చేశామని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని ఇన్‌చార్జ్‌గా నియమించే ఆనవాయితీ టీడీపీలో ఉండేది. సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఈ వ్యవస్థ రద్దయింది.