జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు వ్యాఖ్యలు విని షాక్ అవ్వాల్సిందే..?

కేంద్రం తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర ప్రయోజనల కోసం ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉంటే.. టీడీపీ చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత వైసీపీ ఒకటో రెంటో సీట్లు గెలుచుకుంటే.. వారు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మీరు లోక్‌సభ ఎన్నికలకి ముందు వైసీపీ మీతో కలవాలని ఎందుకు పిలుపునిస్తున్నారని మీడియా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘‘వాళ్లు ఒకటో.. రెండో సీట్లు గెలిస్తే.. వాళ్లు మాకు మద్దతు ఇవ్వాలి. దాంట్లో తప్పులేదు’’ అని చంద్రబాబు అన్నారు. కాగా చంద్రబాబు చేస్తున్న ఈ ధర్మపోరాట దీక్షకు దేశవ్యాప్తంగా భారీగా మద్దతు లభిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్‌పీ అధినేత్ర మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు బాబుకు మద్దతు ఇచ్చారు.