దాసరి రోల్‌లోకి చిరంజీవి..! అంత సీన్ లేదన్న హీరోలు..!!

దాసరి నారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న రాజకీయ నేత కావడంతో.. బియాండ్ ఇండస్ట్రీ ఆయన కార్మికులు, ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేసేవారు. దాంతో సహజంగానే ఇండస్ట్రీ పెద్దగా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దగ్గరకు వెళ్లడం.. పరిష్కరించుకోవడం కామన్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు శ్రీరెడ్డి అనే నటీమణి పెట్టిన చిచ్చు కారణంగా టాలీవుడ్ లో ఏర్పడిన దావాలనం… మెగా ఫ్యామిలీకి అంటుకుంది. తమ దాకా రాలేదు కదా అని.. అప్పటి వరకు నోరు మూసుకుని కూర్చున్న వారంతా… తమకు అంటుకునేసరికి పెడబొబ్బలు ప్రారంభించారు.
తమకు ఎవరూ సపోర్ట్ రాకపోవడంతో.. చిరంజీవి రంగంలోకి దిగి.. హీరోలతో మంతనాలు ప్రారంభించారు. ఓ సాయంత్రం..అందర్నీ అన్నపూర్ణ స్టూడియోకు పిలిచి.. చర్చలు ప్రారంభించారు. అందరం కలసికట్టుగా ఉందాం..

సమస్యలు పరిష్కరించుకుందాం.. అని కాసేపు స్పీచ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ కాబట్టి.. హీరోలు ఆయనకు గౌరవం ఇచ్చారు. సమావేశానికి వచ్చారు. కానీ మెగా ఫ్యామిలీకి సమస్య వచ్చింది కాబట్టే.. ఆయనకు బయటకు వచ్చారని..లేకపోతే వచ్చే వారా అని ఆ హీరోలు.. చిరంజీవి ప్రతిపాదనను లైట్ తీసుకున్నారట. శ్రీరెడ్డి అనే నటీమణి.. శేఖర్ కమ్ముల, నాని, కోన వెంకట్ సహా అనేక మంది ప్రముఖులపై ఆరోపణలు చేసినా స్పందించని చిరంజీవి.. తమ దాకా వచ్చేసరికి.. అందరి సపోర్ట్ కోసం వచ్చారని…ఇందులోనే ఆయన సహకారం స్థాయి తెలుస్తోందని.. చాలా మంది హీలో అభిప్రాయమట.

మొత్తానికి ఈ సమస్యను పరిష్కరించి.. తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కును అవుతానననుకున్న చిరంజీవికి… మొదట్లోనే ఆర్టిస్టులు షాక్ ఇచ్చారు. చిన్న సమస్య వచ్చినా.. అది నాకు సంబంధం లేదు కాదా.. అని మెగా క్యాంప్ అనుకుంటూ ఉంటుంది. తమకు సంబంధించినదైతే..ఎంత వరకైనా వెళుతుంది. అది ఇండస్ట్రీకి నష్టం చేకూర్చినా సరే వెనుకాడరు. నంది అవార్డుల విషయంలో..మెగా క్యాంప్ అదే చేసింది. వారి చేసిన రచ్చతో… నంది అవార్డుల విలువకే బొక్కపడింది. ఆ అవార్డులు.. ఏపీ ప్రభుత్వం ఇక ముందు ఇవ్వడం కూడా అనుమానంలో పడేశారు.