ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరంజీవి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల రసవత్తంగా మారుతున్నాయి. ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా ఎవరికి వారే ప్రచారంలో దూసుకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పడు ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా? అంటే అవుననే టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చేవెళ్ల బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు తెలుపుతూ విశ్వేశ్వరరెడ్డి తరుపున చిరు ప్రచారం చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 8వ తేదిన వికారాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకి సోనియా రానున్నారు, కాగా సభకి చిరంజీవి కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాగా ఇటీవలే చిరంజీవిని కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఇతర అంశాలపై చర్చించారు.