కాంగ్రెస్‌కు ఉహించని షాక్.. పలువురు ముఖ్య నేతల రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి పలువురు మండల నాయకులతోపాటు, కేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడు మల్లవరం అరవిందరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పోతుల లక్ష్మీ, మాజీ వార్డు సభ్యులు రవీంద్రాచారి తదితరులు రాజీనామాలు చేశారు. ఇటీవల కొంత మంది పార్టీ నాయకుల తీరుపై విసుగుచెంది రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో గాలి కృష్ణ, సిద్దిరెడ్డి, చంద్రారెడ్డి, రాజమౌళి, బైరి శ్రీనివాస్‌, సతీష్‌, మహేశ్‌, రాజు, ఎల్లయ్య, కృష్ణ, సిద్దారెడ్డి, రమేశ్‌, అంజలి, చంద్రయ్య, ప్రభాకర్‌రెడ్డి, సత్తెమ్మతో పాటు 150 మంది వరకు ఉన్నారు.