కాంగ్రెస్‌కి మరో షాక్.. సీనియర్ నేత గుడ్‌బై..

కాంగ్రెస్‌కి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌కి తన రాజీనామ లేఖ పంపిన పొంగులేటి.. అందులో తీవ్రమైన విమర్శలు చేశారు.

 

పార్టీలో విలువలు పతనమయ్యాయని, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం వైఫల్యాలను సైతం పొంగులేటి తన లేఖలో ప్రస్తావించారు. పార్టీలో పరిణామాలను తాను హైకమాండ్‌కి తెలిపినా.. మధ్యలో ఉన్న కొందరు వ్యక్తుల కారణంగా తన మాటల్ని పెడచెవిన పెట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనన్నారు పొంగులేటి సుధాకర్‌రెడ్డి.