ద‌శాబ్దాల స‌మ‌స్య‌లకు దామ‌చ‌ర్ల చెక్‌..!

ప్ర‌కాశం జిల్లా టీడీపీ అధ్య‌క్షుడుగా ఉన్న దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌.. కృషికి మారుపేరు. ఏ ప‌నిని ఆయ‌న త‌ల‌పెట్టినా విజ‌య‌మే త‌ప్ప అప‌జ‌యం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయ జీవితంలో లేనే లేదు. అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న ప్ర‌కాశం జిల్లాను దేశ‌స్థాయికి తీసుకు వెళ్లి.. స్వ‌చ్ఛ భార‌త్ అవార్డులను కైవ‌సం చేసుకునేలా తీర్చిదిద్దిన నిరంతర కృషీ వలుడుగా ఆయ‌న గుర్తింపు సాధించారు. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో విజ‌యం సాధించిన ఆయ‌న త‌న తాత ఆంజ‌నేయులు వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఒక్క రాజ‌కీయంగానే కాకుండా ఆంజ‌నేయులులోని స‌మ‌న్వ‌యం, స‌హ‌నం, ప‌నిచేసే ల‌క్ష‌ణాలు వంటివాటిని కూడా ఆయ‌న అందిపుచ్చుకున్నారు.

ఫ‌లితంగా అనేక భిన్న మ‌న‌స్త‌త్వాలు, వివిధ పార్టీల నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన నాయ‌కుల‌ను కూడా స‌మ‌న్వ‌యం చేసుకుంటూ… ముందుకు సాగుతున్నారు. ఒక‌ప్పుడు ప్ర‌కాశం అంటే రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌ల‌కు కేంద్రంగా ఉండేది. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణులు ఎక్కువ‌గా ఉండేవి. దీంతో రాజ‌కీయంగా ఈ జిల్లా బ్యాడ్ పొజిష‌న్‌లోనే ఉండేది. అయితే, జ‌నార్ద‌న్ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం తెచ్చారు. అంద‌రూ క‌లిసి మెలిసి ఉంటే.. పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌నే సూత్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. అధ్యక్షుడు తానే అయినా.. సీనియ‌ర్ల‌ను కూడా క‌లుపుకుని పోతూ. అంద‌రి ఆలోచ‌న‌ల‌ను పంచుకుని తుది నిర్ణ‌యం తీసుకుంటున్నారు.

ఫ‌లితంగా అంద‌రూ కూడా జ‌నార్ద‌న్ బాట‌లో న‌డుస్తూ.. పార్టీని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల విష‌యంలోనూ ఆయ‌న దూకుడుగానే ఉన్నారు. అదేస‌మ‌యంలో త‌న తాత‌గారైన ఆంజ‌నేయులు హ‌యాం నుంచి అప‌రిష్కృతంగా ఉన్న ఒంగోలు రైల్వేస్టేష‌న్ భూముల్లో నివాసం ఉంటున్న పేద‌ల వ్య‌వ‌హారానికి కూడా చెక్ పెట్టేందుకు జ‌నార్ద‌న్ పూనుకున్నారు. ఎంపీ మాల్యాద్రి స‌హ‌కారంతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆ భూముల‌ను రెగ్యుల‌రైజ్ చేసి ఇచ్చేందుకు నిధులు స‌మీక‌రించిరైల్వే అధికారుల‌తోనూ చ‌ర్చించారు. ఈ ప‌నిపై ఆయ‌న ఢిల్లీకి కూడా వెళ్లి ఉన్న‌త‌స్థాయిలో చ‌క్రం తిప్పుతున్నారు. నా కెందుకులే ! అనే ధోర‌ణిని ప‌క్క‌కు పెట్టి పేద‌ల ప‌క్షాన ఆయ‌న పోరు చేస్తున్న తీరు అంద‌రికీ ఆద‌ర్శ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.