మెంతుల‌కు శృంగారానికి లింకేంటి…

శృంగారంపై ఆసక్తి పెరగటానికి చాలామంది పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం కొంత‌మంది గోంగూర‌ను వాడుతుంటారు. మ‌రికొంద‌రు మునక్కాడలలాంటి పదార్థాలను తింటుంటారు. కొంత‌మంది జీడిప‌ప్పు, ఇత‌ర బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ప‌దార్థాలు తింటుంటారు. శృంగారంపై ఆస‌క్తి పెరిగేందుకు ప‌లువురు ర‌క‌ర‌కాల అంశాల‌పై ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌లు చేశారు. అయితే తాజాగా మెంతులుపై చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వీటికి శృంగారానికి ఆస‌క్తిక‌ర‌మైన లింకులు ఉన్న‌ట్టు తేలింది.

అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది శాస్త్రీయంగా రుజువు కాలేదు. అయితే మెంతులు శృంగారంపై ఆసక్తి పెరిగేలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మగవారు తరచూ మెంతులను తీసుకుంటే వారికి శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలింది. ఈ పరిశోధనలో భాగంగా కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్నిఇచ్చి పరిశీలించగా వారిలో శృంగారాసక్తి పెరిగినట్టు వెల్లడైంది.

మెంతుల్లో శృంగారాస‌క్తిని పెంపొందించే కొన్ని గుణాలు ఉన్నాయ‌ట‌. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని అమితంగా ప్రేరేపిస్తాయి. అందుకే మెంతులు శృంగారంపై ఆసక్తి పెరిగేందుకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మెంతులు కేవ‌లం శృంగారాస‌క్తికే కాకుండా ప‌లు ఆరోగ్య‌క‌ర‌మైన అంశాల‌కు కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతాయి.