గూడెంలో ‘ ఈలి ‘ కుటుంబం అరుదైన రికార్డు

రాజ‌కీయాల్లో గుర్తింపు సాధించ‌డం, ప్ర‌జ‌ల మ‌నుషులుగా చ‌లామ‌ణి కావ‌డం అంటే మాట‌లు కాదు. ఎంతో శ్ర‌మించాలి. ఎ న్నో విధాల ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి. ఇలా వ్య‌క్తులే రాజ‌కీయాల్లో గుర్తింపు కోసం త‌హ‌త‌హ లాడుతున్న ప‌రిస్థితిలో ఏకంగా ఓ కుటుంబ‌మే రాజకీయాల్లో గుర్తింపు పొంద‌డం అంటే మ‌రింత రికార్డుగానే భావించాలి. ఇలాంటి రికార్డునే సొంతం చేసు కున్నారు ఈలి వెంక‌ట మ‌ధుసూద‌న‌రావు. ఉర‌ఫ్ నాని. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌దై న ప్ర‌త్యేక ముద్ర‌ను వేసింది ఈలి కుటుంబం. ఈలి ఆంజ‌నేయులు, ఆయ‌న స‌తీమ‌ణి ఈలి వ‌ర‌ల‌క్ష్మీదేవిలు రాజ‌కీయాల్లో త‌మ స‌త్తా చాటుకున్నారు.

గ‌తంలో ప‌లుమార్లు తాడేప‌ల్లి నుంచి చ‌క్రం తిప్పిన ఈ ఫ్యామిలీ ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు సాధించారు. అభివృద్ధి సంక్షే మం నినాదంతో దూసుకుపోయారు. ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈలి కుటుంబం గెలుస్తూ రావ‌డం సంచ‌ల‌నంగా మారిం ది. పార్టీల‌తో సంబంధం లేకుండానే ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొని… వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ఫ్యామిలీకి ప్ర‌జ‌లు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ట్టం క‌డుతూనే ఉన్నారు. ముఖ్యంగా వివాదాల‌కు దూరంగా ఉండ‌డం, నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండడం, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను త‌మవిగా బావించ‌డం ఈలి ఫ్యామిలీ ప్ర‌త్యేక‌త‌. ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. చివ‌ర‌కు త‌మ వ‌ద్ద ప‌నిచేసే కుటుంబాల‌కు చెందిన వారి ఇళ్ల‌లో కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. హాజ‌రై ఆశీర్వ‌దించ‌డం వీరి ప్ర‌త్యేక‌త‌.

అంతేకాదు, ఈలి ఫ్యామిలీకి ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త‌, నిగ‌ర్వంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోవ‌డం, ఈ క్ర‌మంలోనే సొంత నియ‌జ‌క‌వ‌ర్గంలో ఓ కుటుంబం ఇన్నేళ్లుగా గుర్తింపు సాధించింది.గ‌తంలో 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారా జ్యం పార్టీ త‌ర‌ఫున తాడేప‌ల్లిగూడెం నుంచి పోటీ చేసిన ఈలి నాని విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత మారిన స‌మీకర ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చేశారు. ఈలి ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్ర‌బాబు.. నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జుగా నియ మించారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌థ్యంలో ఈ టికెట్‌ను నానికి క‌న్ఫ‌ర్మ్ చేశారు చంద్ర‌బాబు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి అవ‌కాశం క‌ల్పించిన చంద్ర‌బాబు ఇప్పుడు నానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక వీరి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం చెప్ప‌క‌నే చెప్పార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.