రాజ‌మౌళి – ఎన్టీఆర్ – చెర్రీ మ‌ల్టీస్టార‌ర్ హీరోయిన్లు వీళ్లే

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి – ది కంక్లూజ‌న్‌ సినిమా విడుదలై వచ్చే నెల ఏప్రిల్ 28 కి సరిగ్గా ఒక ఏడాది. ఈ సినిమా రిలీజ్ అయ్యి యేడాది అవుతున్నా రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. బాహబలి త‌ర్వాత సినిమాను రాజమౌళి గ్రాఫిక్స్ లేకుండా తెరకెక్కిస్తున్నట్లుగా గతంలోనే ఎనౌన్స్ చేశాడు. ఇక రాజ‌మౌళి నెక్ట్స్ సినిమాలో ఎన్టీఆర్ – రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ తోపాటు…. స్క్రిప్ట్ పనులు చ‌క‌చ‌కా పూర్త‌వుతున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ , చెర్రీ ఇద్ద‌రూ పోలీస్ ఆఫీస‌ర్లుగా క‌నిపిస్తార‌ట‌. ఇప్ప‌టికే కొన్ని పాత్ర‌ల‌కు సంబంధించి న‌టీన‌టుల ఎంపిక కూడా జ‌రుగుతోంద‌ట‌. ఇక రాజమౌళి చూపు తొలిప్రేమ తో హిట్ కొట్టిన రాశీ ఖన్నా మీద పడిందని.. రాశి ఖన్నా ని ఎన్టీఆర్ కి సరసన నటింపచేయనున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు చరణ్ పక్కన నటించబోయే హీరోయిన్ ని కూడా రాజమౌళి టీం సెట్ చేసేశార‌ట‌.

చ‌ర‌ణ్‌తో ప్రస్తుతం రంగస్థలంలో జత కడుతున్న స‌మంత పేరును ప‌రిశీలిస్తున్నార‌ట‌. స‌మంత ఇప్ప‌టికే చర‌ణ్ తాజా సినిమా రంగ‌స్థ‌లం 1985లో న‌టిస్తోంది. ఇప్పుడు అదే స‌మంత‌ను మ‌రోసారి చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టిస్తే సినిమాకు సౌత్‌లోని అన్ని భాష‌ల్లోనూ అదిరిపోయే క్రేజ్ ఉంటుంద‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌. ఇక ఈ యేడాది సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్‌మీద‌కు వెళ్లే ఈ సినిమాలో ఫైన‌ల్‌గా ఎన్టీఆర్ ప‌క్క‌న రాశీఖ‌న్నా, రాంచ‌ర‌ణ్ ప‌క్క‌న స‌మంత హీరోయిన్లుగా ఫిక్స్ అయిన‌ట్టే అని ఇండ‌స్ట్రీలోనూ టాక్ న‌డుస్తోంది.