పెద్ద పదవులొద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలంటున్న వైసీపీ నేత

తనకు ఎలాంటి పెద్ద పదవులు వద్దని, ఎమ్మెల్యే టికెట్టు ఇస్తే చాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం గొల్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో ఆకేపాటి అనుచరులు పలువురు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉంటూ తమ కార్యకర్తల్లో మనో ధైర్యం నింపుతూ పార్టీని ముందుకు నడిపించిన ఘనత ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిదేనన్నారు. కొత్తగా పార్టీలోకి చేరుతున్న మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్టు ఇస్తే తాము ఎటువంటి పరిస్థితుల్లో సహకరించమన్నారు.

వైసీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆకేపాటికి అన్యాయం చేయరని భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు సిద్దవరం గోపిరెడ్డి, వైసీపీ నాయకులు గీతాల నరసింహారెడ్డి, జేసీబీ సుబ్బారెడ్డి, గంపా సుధాకర్‌, నడివీధి సుధాకర్‌, అరిగెల సౌమిత్రి, అరిగెల దినేష్‌, పల్లె గ్రీష్మంత్‌రెడ్డి, ఆనాల మధు, గుండు మల్లికార్జునరెడ్డి, నారాయణ, గుండు గోపాల్‌రెడ్డి, పుత్తా శంకర్‌, మోడపోతుల రాము, గొబ్బిళ్ల త్రినాధ్‌, సయ్యద్‌ అమీర్‌, అజీజ్‌, షావల్లీ పాల్గొన్నారు.