వైఎస్ఆర్ మృతిపై జగన్ సంచలన ఆరోపణలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిపై ఆయన తనయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. పులివెందులలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘మా నాన్నను కడపకే పరిమితం చేయడానికి.. ఆనాడు మా తాత రాజారెడ్డిని దారుణంగా చంపేశారు. ఆ తర్వాత నాన్నను చంపేశారు. మా నాన్న మృతిపై ఇప్పటికీ మాకు అనుమానాలున్నాయి. ఆ సమయంలో జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ విచారణ జరిపారు. నాన్న చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందే అసెంబ్లీలో చంద్రబాబు సవాల్ చేశారు. ఆ తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చూశారు. ఎయిర్ పోర్టులో ఏకంగా కత్తులతో దాడి చేశారు. దాన్ని కూడా వెటకారం చేస్తూ మాట్లాడతారు. మూడు చోట్లా ఒకే ఒక వ్యక్తి.. కనపడుతున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే చిన్నాన్న హత్యకు గురయ్యారు’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు జగన్.