జగన్‌ వినుకొండలో గెలిచే దమ్ముందా… ‘ జీవీ ‘ అభివృద్ధి ముందు కుప్పిగంతులా..

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులు పేరు చెబితే గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు క్రేజ్‌ ఉంది. ఓ సాధారణ కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగి సేవకు సరైన అర్థం చెప్పి నైతిక విలువలతో కూడిన వ్యక్తిగా ఈ రోజు ఆయన రాజకీయాల్లో పేరొందారు. కాకలుతీరిన రాజకీయ యోధులు, ఉద్దండులు ఉన్న గుంటూరు జిల్లాలో టీడీపీ పగ్గాలు ఈ రోజు చంద్రబాబు ఆంజనేయులకు ఇచ్చారంటే ఆంజనేయులపై ఉన్న అచంచలమైన విశ్వాసమే కార‌ణం. అలాంటి ఆంజనేయులను నియోజకవర్గంలో ఎదుర్కొనే దమ్ము లేక, తన పార్టీ నుంచి ఎవరిని పోటీ చేయించాలో తెలియక తల పట్టుకుంటున్న విపక్ష వైసీపీ అధినేత జగన్‌ చివరకు తన పత్రికలో ఆయనపై విషం చిమ్ముతున్నారు.

గుంటూరు జిల్లాలోనే ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పల్నాడులోని వినుకొండ నియోజకవర్గాన్ని ఓ రేంజులో అభివృద్ధి చేసి ఓ రూపురేఖలు తీసుకువచ్చిన ఘన‌త ఎవరిదంటే నిస్సంకోచంగా ఆ ఘనత జీవీ. ఆంజనేయులదే. అత్యంత వెనకబడిన ఈ నియోజకవర్గంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించే విషయంలోగాని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలోగాని ఆయన ఏ నాడు రాజీ పడలేదు. 2004 ఎన్నికలకు ముందు నుంచే తన శివ శక్తి లిలా అంజన్‌ ఫౌండేషన్‌ ద్వారా విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేద ప్రజలకు కంటి ఆపరేషన్లు, నిరు పేదలకు బూరి విరాళాలు ఇవ్వడం, అనేక కార్యక్రమాల్లో నిత్య అన్నదానాలతో పాటు రైతుల కోసం లెక్కకు మిక్కిలిగా ఖ‌ర్చు చేసి వారు ఇబ్బందులు లేకుండా వ్య‌వ‌సాయం చేసేలా చేసిన క్రెడిట్ జీవీదే.

ఆంజ‌నేయులు సేవ‌లు చూసే 2009, 2014 ఎన్నికల్లో రెండు సార్లు నియోజకవర్గ జనాలు 22 వేలు, 24 వేల‌ ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించి ఆయనకు తిరుగులేని పట్టం కట్టారు. వచ్చే ఎన్నికల్లో మరో సారి ఘన విజయం దిశగా ఆయన దూసుకుపోతున్నారు. ఆంజనేయులను నేరుగా ప్రజాక్షేత్రంలో ఢీ కొట్టే దమ్ము లేక చివరకు వైసీపీ వాళ్లు తమ నీచ పుత్రిక అయిన సాక్షి పత్రికను అడ్డం పెట్టుకుని బురద జల్లే కార్యక్రమానికి తెర తీస్తున్నారు. ఎంత దారుణం అంటే ఆంజనేయులు తన శివ శక్తి లిలా అంజన్‌ ఫౌండేషన్‌ ద్వారా నియోజకవర్గంలో లక్ష మందికి పైగా పేదలకు కంటి శుక్లాల‌ ఆపరేషన్లు చేయించి కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. గత 15 సంవత్సరాలకు పైగా ఇది ఒక మహా యజ్ఞంగా జరుగుతూ వస్తోంది. దీనిపై సైతం సాక్షిలో బురద జల్లారంటే వాళ్లు ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారారో అర్థం అవుతోంది. గుంటూరు జిల్లాలోనే అన్నదానాల్లో దానకర్ణుడు అన్న పేరు ఆంజనేయులకు ఉంది. ఈ అన్నదానాలు చేసే విషయంపై సైతం సాక్షి పత్రికలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎంత జుగుస్సాకరంగా ఉన్నాయో అర్థం అవుతోంది.

జీవీ రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచాక 2014 నుంచి నియోజకవర్గంలో ఉన్న సాగర కాల్వల్లో మేజర్‌, మైనర్ కాల్వ‌లు అన్నిటిని అభివృద్ధి చేశారు. ఈ రోజు టైలేండ్‌ ప్రాంతమైన వినుకొండలో చివరి ఆయుకట్టుకు సైతం నీరు అందుతూ ప్రకాశం జిల్లాకు నీరు వెళ్తుందంటే అది ఇక్కడ ఆంజనేయులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో సాగ‌ర్ కాల్వ‌ల‌ను ఆధునిక‌రీంచేలా చేసిన పుణ్యమే. ఇక్కడ సైతం నీటి విడుదల విషయంలో ఏ రోజు నీళ్లు విడుదల చేస్తున్నారో తెలుసుకుని వైసీపీ సమన్వయకర్త బోల్లా బ్రహ్మనాయుడు డ్రామాలాడి రైతుల చేత ఇప్పటికే చివాట్లు తిన్నారు. ఇప్పుడు రైతులకు నీళ్ళు అంది ఆంజనేయులకు క్రేజ్‌ రావడంతో ఈ విషయంలోనూ సాక్షి బురద జల్లింది. ఇక మున్సిపాల్టీలో ఆంజనేయులు పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకుని మున్సిపాల్టీ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు. వినుకొండ మున్సిపాల్టీలో ఆ పార్టీ… ఈ పార్టీ అని లేకుండా కులాలు మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆంజనేయులకే జై కొడుతున్నారు.

తాజాగా వినుకొండ మున్సిపాల్టీకి నీటి ఎద్దడి ఏర్పడితే బొల్లాపల్లి మండలంలోని ఎన్‌ఎస్పీ డీప్‌ కట్‌ నుంచి ఏకంగా 18 కిలోమీటర్ల పాటు నీటిని ట్యాంకర్ల ద్వారా టౌన్‌కి తీసుకువచ్చి నీటిని సరఫరా చేసి ఆయన అపర భగీరధుడిగా వినుకొండ చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. దీంతో ఆంజనేయులు ఇంత చేస్తే దీన్ని అందరూ కీర్తిస్తుంటే దీన్ని ప్రశంసించాల్సింది పోయి నెగిటీవ్‌ ప్రచారం చెయ్యడం వైసీపీ వాళ్లకే చెల్లింది. దాదాపు 17 సంవత్సరాలుగా వినుకొండ రాజకీయాల్లో ఆంజనేయులు ద్వారా నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ సహాయం పొందారంటే అతియోశ‌క్తి కాదు. గత నాలుగున్నర ఏళ్లలోనే రూ. 1900 కోట్లతో అభివృద్ధి పనులు జరగగా మరిన్ని అభివృద్ధి పనులు ప్రతిపాదన దిశలు దాటి పట్టాలెక్కనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ క్యాండేట్‌ కాదు కదా వైసీపీ అధినేత వచ్చి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆంజనేయులపై సాక్షి నీచపు రాతలతో ప్రజల్లో ఆయన్ను చులకన చెయ్యాలని చూస్తోంది. అయితే అవన్నీ బూమరాంగ్‌ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

కొసమెరుపు..
వినుకొండ‌పై జిల్లా వైసీపీలోనూ, రాష్ట్ర వైసీపీ నాయ‌క‌త్వంలోనూ జ‌రుగుతోన్న చ‌ర్చ ఏంటంటే ఆ సీటూ ఎలాగూ మ‌నం గెల‌వ‌లేం.. క‌నీసం అక్క‌డ మెజార్టీ త‌గ్గితే న‌ర‌సారావుపేట ఎంపీ సీటు అయినా గ‌ట్టెక్కుతాం అనుకుంటున్నారు. ఇక ఇక్క‌డ గెలిచే క్యాండెట్ జ‌గ‌న్‌కు ఇప్ప‌టికి దొర‌క‌లేదు స‌రిక‌దా ఎన్నిక‌లు మ‌రో రెండు నెల‌ల్లో ఉన్న వేళ దొరికే ప‌రిస్థితి కూడా లేదు.