రివ్యూ: జై ల‌వ‌కుశ‌

టైటిల్‌: జై ల‌వ‌కుశ‌,న‌టీన‌టులు: న‌ంద‌మూరి తార‌క‌రామారావు, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్ త‌దిత‌రులు,మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె.నాయుడు,ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు,నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌,ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌.ర‌వీంద్ర (బాబి), ర‌న్ టైం: 158 నిమిషాలు,సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ,రిలీజ్ డేట్‌: 21 సెప్టెంబ‌ర్‌, 2107

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ ఈ రోజు థియేట‌ర్ల‌లోకి భారీ అంచ‌నాల మ‌ధ్య వచ్చేసింది. ఎన్టీఆర్ మూడు వ‌రుస సూప‌ర్ హిట్ల‌తో తిరుగుల‌ని ఫామ్‌లో ఉండ‌డంతో పాటు బిగ్ బాస్ షోతో ఇళ్ల‌ల్లోకి కూడా ఎన్టీఆర్ చొచ్చుకు వ‌చ్చేయ‌డంతో ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు తెలుగు నాట పిచ్చ‌పిచ్చ‌గా పెరిగిపోయింది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్‌గా రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ సినిమాకు ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన ముగ్గురు అన్న‌ద‌మ్ములు జై, ల‌వ‌, కుశ (ముగ్గురు ఎన్టీఆర్‌లు) మేన‌మామ పోసాని కృష్ణ‌ముర‌ళీ ద‌గ్గ‌ర పెరుగుతారు. అయితే తెనాలి నాట‌క స‌మాజంల నాట‌కాలు వేసుకునే ఈ ముగ్గురిలో జైకు న‌త్తి ఉండ‌డంతో ల‌వ‌, కుశ హైలెట్ అవుతారు. స‌మాజంతో పాటు సోద‌రుల నుంచి కూడా అవ‌మానాలు ఎదుర‌వ్వ‌డంతో కుంగిపోయిన జై నెగిటివ్ థాట్స్‌లోకి వెళ్లి క్రూరంగా మారిపోతాడు. ఓ సారి నాట‌కం జ‌రుగుతుండ‌గా బాంబ్ బ్లాస్ట్ అవ్వ‌డంతో ఈ ముగ్గురు అన్న‌దమ్ములు విడిపోతారు. 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత కట్ చేస్తే ఈ ముగ్గూరు పెరిగిపెద్ద‌వాళ్లు అవుతారు. వీరిలో అమాయ‌కుడైన ల‌వ‌కుమార్ బ్యాంక్ మేనేజ‌ర్ అవుతాడు. దొంగ‌గా మారిన కుశ పెద్ద కంత్రీ అవుతాడు. ఇక బైరాంపూర్ అనే ఊరిని శాసించే క్రూర‌మైన వ్య‌క్తి రావ‌న్‌గా జై మార‌తాడు. ఓ ప్ర‌మాదంలో ల‌వ‌, కుశ క‌లుసుకుని అన్న‌ద‌మ్ములం అన్న విష‌యం తెలుసుకుంటారు. ఆ టైంలో క‌ష్టాల్లో ఉన్న మేనేజర్ ల‌వ ప్లేస్‌లోకి కుశ ఎంట్రీ ఇచ్చి అత‌డిని మ‌రిన్ని ఇబ్బందుల్లోకి నెడ‌తాడు. ల‌వ‌కుమార్ ప్రియ‌(రాశీఖ‌న్నా)ను ప్రేమిస్తాడు. ఇక త‌న సోద‌రులు బ‌తికే ఉన్నార‌ని తెలుసుకున్న జై వాళ్ల‌ను కిడ్నాప్ చేసి త‌న పొలిటిక‌ల్ గేమ్ కోసం ఒక‌రిని, త‌న ప్రేమ (నివేదా థామ‌స్‌) కోసం మ‌రొక‌రిని త‌న ప్లేస్‌లోకి పంపిస్తాడు. అయితే చివ‌ర్లో త‌న ల‌క్ష్యాలు నెర‌వేరాక సోద‌రుల‌నే చంపాల‌ని ప్లాన్ చేస్తాడు. మ‌రోవైపు ఎంపీగా పోటీ చేస్తోన్న జైను చంపేందుకు సిట్టింగ్ ఎంపీ స‌ర్కార్ ప్లాన్ చేస్తాడు ? చివ‌ర‌కు ఈ ముగ్గురు అన్న‌ద‌మ్ముల స్టోరీ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ:
ఎన్టీఆర్ మూడు క్యారెక్ట‌ర్ల‌లోను అమేజింగ్ పెర్పామెన్స్ ఇచ్చాడు. వీటిల్లో జై అలియాస్ రావ‌న్ క్యారెక్ట‌ర్ అయితే ఆధునిక రావ‌ణాసురుడిని గుర్తు చేసింది. సీనియ‌ర్ ఎన్టీఆర్ రావణ బ్ర‌హ్మ‌ను త‌ల‌పించేలా ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, యాక్టింగ్ అదిరిపోయింది. జై రావ‌న్ క్యారెక్ట‌ర్ సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లింది. హీరోయిన్ల‌లో ప్రియ‌గా రాశీఖ‌న్నా ల‌వ‌కుమార్ ప్రియురాలిగా న‌టిస్తే ఇక జై లాంటి క్రూర‌మైన వ్య‌క్తి మ‌న‌స్సు గెలుచుకునే త‌ప‌స్విగా నివేద న‌టించింది. అయితే నివేద‌ను జై ల‌వ్ చేస్తుంటే ఆమె మాత్రం కుశ‌ను ఇష్ట‌ప‌డుతుంది. మిగిలిన వాళ్ల‌లో సాయికుమార్‌, పోసాని, విల‌న్ రోనిత్‌రాయ్ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. త‌మ‌న్నా స్వింగ్ జ‌రా ఐటెం సాంగ్‌లో పైనుంచి కింద‌కు అందాల‌ను ఊపేసి ఊపేసి మ‌రీ చూపించింది. సాంకేతికంగా చోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ, దేవిశ్రీ మ్యూజిక్‌, ఆర్ఆర్ బాగున్నాయి. ఆర్ట్ వ‌ర్క్‌, యాక్ష‌న్ విభాగాల‌కు మంచి మార్కులు వేయాలి. ఎడిటింగ్ మాత్రం కాస్త ట్రిమ్ చేయాలనిపించింది. క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువ‌లు హై రేంజ్‌లో ఉన్నాయి. ఇక ద‌ర్శ‌కుడు బాబి పాత క‌థ‌నే తీసుకున్నా ఎంట‌ర్‌టైన్‌మెంట్ డోస్ త‌గ్గ‌కుండా ఎమోష‌న‌ల్ మేవ‌ళింపుతో సినిమాను ముందుకు తీసుకువెళ్లాడు.

బాబి ట్రీట్‌మెంట్‌కు తోడుగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎన్టీఆర్ విరోచిత న‌ట విశ్వ‌రూపం సినిమాను హిట్ చేసేశాయి. బాబి ఫ‌స్టాఫ్ వ‌ర‌కు సాధార‌ణంగా సినిమాను న‌డిపించి ఇంట‌ర్వెల్ బ్యాంగ్ నుంచి రైజ్ చేసి సెకండాఫ్‌లో హీరోయిజాన్ని, జై రావ‌న్ రోల్‌ను బాగా ఎలివేట్ చేశాడు. ఇక క్లైమాక్స్‌లో ఎమోష‌న‌ల్ సీన్లు, అన్న‌ద‌మ్ముల అనుబంధంతో ముగింపు ఇచ్చాడు.

ప్ల‌స్‌లు (+): ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం, సెకండాఫ్‌, కామెడీ, ఎమోష‌న‌ల్ సీన్లు, త‌మ‌న్నా ఐటెం సాంగ్‌, నిర్మాణ విలువ‌లు,టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్‌,స్క్రీన్ ప్లే

మైన‌స్‌లు (-): రొటీన్ స్టోరీ,యావ‌రేజ్ ఫ‌స్టాఫ్‌,లెన్దీ సీన్లు, ఎడిటింగ్‌

ఫైన‌ల్‌గా….
ఎన్టీఆర్ న‌టనా విశ్వ‌రూపం…తార‌క్‌ అక్కౌంట్‌లో మరో మంచి హిట్‌

జై ల‌వ‌కుశ మూవీ డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 3.75 / 5