జనం మీదకు డబ్బులు విసిరేసిన నేత…వైసీపీ వింత పోకడ..

ఎన్నికల ప్రచారంలో వైసీపీ వింత పోకడ అనుసరిస్తోంది. వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్‌‌రెడ్డి ప్రచారంలో స్థానిక నేత జనం మీదకు కరెన్సీ నోట్లు వెదజల్లారు. దీంతో డబ్బులు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. డబ్బులు తీసుకోవడానికి ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. డబ్బు మదంతో వైసీపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నోట్లు ఇష్టం వచ్చినట్లు వెదజల్లుతున్నారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివేళ్ల గ్రామంలో వైసీపీ నేతలు డబ్బులు వెదజల్లారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో నోట్ల పందారం విచ్చలవిడిగా సాగుతోంది. వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న బ్రిజేందర్‌‌రెడ్డి నిన్న శిరివేళ్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇవాళ జగన్ నంద్యాల పట్టణంలో రానున్న తరుణంలో ఆయన అనుచరవర్గాన్ని నంద్యాలకు తరలించాలని నిర్ణయించారు. ఎందుకంటే వైసీపీకి నంద్యాలలో వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో జగన్ సభకు ఆళ్లగడ్డ, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలను నంద్యాలకు తరలించాలని భావించారు.

ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న బ్రిజేందర్‌‌రెడ్డి నిన్న ఆ గ్రామానికి వెళ్లి జగన్ సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ డబ్బులు ప్రజలమీదకు వెదజల్లారు. నోట్లు అందుకునే క్రమంలో ప్రజల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం కూడా ఆళ్లగడ్డ, శిరివేముల పట్టణంలో ఇటువంటి సంఘటనే జరిగినట్లు సమాచారం. దీంతో ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. డబ్బు మదంతో వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.