జనసేన చేరికపై క్లారీటి ఇచ్చిన అఖిలప్రియ

టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, విజయాన్ని చంద్రబాబుకు కానుగా ఇస్తానని మంత్రి తెలిపారు. పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా పెట్టానని వివరణ ఇచ్చారు. గన్‌మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని మంత్రి అఖిలప్రియ తెలిపారు.