ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ టైటిల్‌… ఇంత కొత్త‌గానా..

నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కెరీర్‌లో ఎన్న‌డూ క‌న‌ప‌డ‌ని కొత్త లుక్‌లో క‌నిపించేందుకు ఎన్టీఆర్ చాలా పెద్ద క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఏకంగా హాలీవుడ్ ట్రైన‌ర్ల‌ను తీసుకువ‌చ్చి మ‌రీ జిమ్‌లో ఫిట్‌నెస్ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ని తెలుస్తోంది. ఇటు ఎన్టీఆర్ నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్నాడు. అటు త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసి సినిమాతో పెద్ద డిజాస్ట‌ర్ ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సినిమా విష‌యంలో ఎలాంటి చిన్న పొర‌పాట్లు కూడా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు త్రివిక్ర‌మ్‌, ఇటు ఎన్టీఆర్ ఇద్ద‌రూ పెద్ద క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. స్క్రిఫ్ట్ వ‌ర్క్ విష‌యంలో త్రివిక్ర‌మ్ ఏ మాత్రం రాజీప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఇప్ప‌టికే రెండు మూడు పేర్లు గాసిప్పులుగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో ఆస‌క్తిక‌రమైన పేరు సినిమా యూనిట్ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఈ టైటిల్‌కే మొగ్గుచూపుతున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ టైటిల్ తెగ చక్కర్లు కొడుతోంది. ‘ఆన్ సైలెంట్ మోడ్’ అనే డిఫెరెంట్ టైటిల్ ఫైనల్ అయిందని అంటున్నారు.

అయితే ఇది మెయిన్ టైటిల్ కాద‌ని…అస‌లు టైటిల్ కింద ఉండే ఉపశీర్షిక మాత్ర‌మే అని చెపుతున్నారు. ఇక ఈ టైటిల్‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.