‘ కందికుంట ‘ పై సాక్షి విష ప్రచారం బూమరాంగ్ …!

అబద్దాలని కూడా అద్భుతంగా తీర్చే దిద్దే సాక్షి (జగన్ కర పత్రిక) మరోసారి అడ్డంగా బుక్కైంది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కందికుంట వెంకట ప్రసాద్‌పై అసత్య కథనం రాసి..విష ప్రచారం చేయడానికి పూనుకుంది. కానీ సాక్షి విష ప్రచారం బూమరాంగ్ అయింది. లేనిపోని కట్టుకథలు చెప్పడం వలన అడ్డంగా దొరికిపోయింది. అసలు ఈ సాక్షి చేసిన విష ప్రచారం ఏంటంటే…కొందరి దగ్గర కందికుంట రూ. 30 కోట్ల ఆస్తి లాక్కున్నారంటూ ఈ అసత్యాల సాక్షి కథనం రాసింది. ఇక ఈ కథనం చూసి భూమికి సంబంధించిన వాళ్ళు బయటకొచ్చి సాక్షిని ఏకీపారేశారు.

అసలు జరిగింది ఏంటంటే…కదిరి పట్టణానికి సమీపంలో ఉన్న హిదుపురం రోడ్డులో ఉన్న వ్యవసాయ పరిశోధనా కార్యలయం ఎదురుగా ఉన్న పాముల పీ ప్రభాకర్ నాయుడుకి సంబంధించిన 2.29 ఎకరాలు ఉన్నాయి. అయితే ఆయన మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు పసుపులేటి సరస్వతి, పసుపులేటి పవన్ కుమార్, గుడ్లుమారి పల్లవిలు 2016 ఆగష్టు1న ఆ భూమిని అమ్మేశారు. ఆ భూమిని పులివెందులకి చెందిన లింగాల ప్రసాద్ రెడ్డి, గాండ్లపెంటకి చెందిన టి సుజన, బెంగళూరుకి చెందిన దీపక్ కృష్ణ మూర్తిలు వాటా విధానంలో కలిసి కొనుగోలు చేశారు. ఇక ఇందులో ఒక వ్యక్తి అయిన దీపక్ బయటకొచ్చి సాక్షి కథనంపై వివరణ ఇచ్చారు. కందికుంట వెంకట కృష్ణప్రసాద్‌కి ఏ మాత్రం సంబంధం లేకున్నా..ఎన్నికల్లో లబ్ది పొందడానికి వైసీపీ, జగన్ పత్రిక విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. అసలు 2016లో ఈ భూమి విలువ ఎకరం కోటి మించి లేదని..ప్రస్తుతం 3 కోట్లు వరకు ఉంటుందని…కానీ జగన్ పత్రిక 30 కోట్లు ఎలా చూపించిదని ప్రశ్నించారు. పైగా ఆ భూమి 2.29 ఎకరాలు అయితే సాక్షిలో 3 ఎకరాలని చూపించారని…ఇక్కడే సాక్షి విష ప్రచారం ఏంటో అర్ధమవుతుందని అన్నారు. అసలు కందికుంటకు సంబంధించిన వారు బెదిరించారని పేర్కొనడం అవాస్తవమని చెప్పారు. భూమిని కొనుగోలు చేసిన తాము ఎవరి వాటాలు వారు తీసుకుని వెళ్లిపోయామని చెప్పారు. దీని బట్టి ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఇటువంటి కథనాలు కల్పించారని అర్ధమవుతుందని అన్నారు.

మొత్తానికి సాక్షి చేసిన విష ప్రచారం ఇలా బూమరాంగ్ అయింది. మళ్ళీ ఇలాంటి కథలు రాయకుండా సాక్షి నోరు మూసేలా చేశారు. అయితే ఇక్కడ కందికుంటపై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి సిద్ధారెడ్డి ముందే చేతులెత్తేసాడు…ఓడిపోతాడని ఫిక్స్ అయిపోయి ప్రచారంలో ప్రలోభాలు మొదలు పెట్టాడు. ఇక దీనికి సాక్షి తోడై ఇలాంటి విష ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక ఇది కూడా ఫెయిల్ అవడంతో…ఎన్నికల ముందే వైసీపీ అభ్యర్ది ఓటమి ఖాయమైపోయిది.