చిర‌కాల ప్రత్యర్ధులు ఏకమయ్యారు….కృష్ణయ్య విజయం నల్లేరు మీద నడకే…

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు…శాశ్వత మిత్రులు ఉండరు అని అంటారు… ఇప్పుడు అదే సీన్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కనపడుతోంది… ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులుగా తలపడిన బొల్లినేని కృష్ణయ్య… కొమ్మి లక్ష్మయ్య నాయుడులు ఇప్పుడు మిత్రులుగా మారిపోయి…ప్రత్యర్ధి పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.1994లో కొమ్మి లక్ష్మయ్య టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. కానీ 99లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన కృష్ణయ్యపై కొమ్మి ఓడిపోయారు. అలాగే 2004లో కొమ్మి ఇండిపెండెంట్‌గా బీజేపీ నుండి పోటీ చేసిన కృష్ణయ్యపై గెలిచారు.

ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో వెంకటగిరి నుండి వైసీపీ తరుపున కొమ్మి లక్ష్మయ్య… టీడీపీ నుండి కురుగుండ్ల రామకృష్ణ పోటీ చేశారు. కానీ అప్పుడు రామకృష్ణ లక్ష్మయ్యపై విజయం సాధించారు. ఇలా వేరు వేరు పార్టీలలో ఉండి రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న కృష్ణయ్య, లక్ష్మయ్య, రామకృష్ణలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. మరో కొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఆత్మకూరు నుండి టీడీపీ తరుపున బొల్లినేని కృష్ణయ్య పోటీ చేస్తున్నారు. కృష్ణయ్య మృదు స్వభావి, మంచి వ్యక్తి కావడంతో చంద్రబాబు పిలిచి మరి ఆత్మకూరు టికెట్ ఇచ్చారు. అలాగే ఆయనకి నియోజకవర్గం మీద మంచి పట్టు ఉంది. ప్రజలకి ఏ సమస్య ఉన్న వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మంచి పేరుంది.

ఇక ఇవే కాకుండా ఆయన విజయానికి లక్ష్మయ్య బాగా కష్టపడుతున్నారు. తన మిత్రుడుని గెలిపించాలని ప్రజలని కోరుతున్నారు. అటు రామకృష్ణ కూడా కృష్ణయ్య విజయానికి కృషి చేస్తున్నారు. ఇలా రాజకీయ ప్రత్యర్ధులు ముగ్గురు ఏకమవడంతో ఆత్మకూరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని నియోజకవర్గ కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. మొత్తానికి ఒకప్పుడు ప్రత్యర్ధులు ఇప్పుడు మిత్రులుగా మారి పార్టీ గెలుపు కృషి చేయడంతో పార్టీ కార్యకర్తలు మరింత రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో పని చేస్తున్నారు. ఏది ఏమైనా ఆత్మకూరులో కృష్ణయ్య విజయం ఆపడం కష్టమే అని ప్రత్యర్ధి పార్టీ కూడా భావిస్తుంది.