ఉభ‌య‌గోదావ‌రి టీడీపీలో ‘ మాగంటి ‘ మెరుపులు… వారిద్ద‌రి విజ‌యం షురూ…!

మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ బాబు, మాగంటి రూపాదేవి ఉర‌ఫ్ ముర‌ళీ మోహ‌న్ కోడ‌లుగా రాజకీయాల్లో గుర్తింపు సా ధించిన ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌పై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత‌మైన చర్చ న‌డుస్తోంది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పో వ‌డం, ప్ర‌తి స‌మ‌స్య‌పైనా పోరాడ‌డం మాగంటి ఫ్యామిలీలకు క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యం. మాగంటి బాబు ప‌శ్చిమ గో దావ‌రి జిల్లా కేంద్రం ఏలూరు నుంచి, మాగంటి రూప తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు.

అయితే, ఈ ఇద్ద‌రి గెలుపుపై అంచ‌నాలు అదిరిపోతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనే మాగంటి బాబు భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఏలూరులో హోరాహోరీ పోరు సాగిన‌ప్ప‌టికీ.. బాబు విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది.ఇక, గ‌డిచిన ఐదేళ్ల కాలంలో మాగంటి బాబు ఇక్క‌డ చేసిన అభివృద్ధి, నియోజ‌క‌వ‌ర్గాన్ని రాష్ట్రంలోనే ముందు వ‌రుస‌లో నిలిపిన తీరు వంటివి ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోవ‌డం, ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ ఆచి తూచి అడుగు వేయ‌డం, ముఖ్యంగా తెలుగు సంప్ర‌దాయానికి విలువ ఇచ్చే నాయ‌కుడిగా ఆయ‌న దూసుకుపోయిన తీరు ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను క‌ట్టి ప‌డేసింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి నిధులు సేక‌రించి ఇక్క‌డ చేసిన అభివృద్ధికి కూడా ప్ర‌జ‌లు ముగ్ధుల‌వుతున్నారు. పిలిస్తే ప‌లికే నాయ‌కుడిగా కూడా మాగంటి ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు వేసుకున్నారు. దీంతో ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు తిరుగులేని మెజారిటీ ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇక‌, రాజ‌మండ్రి ఎంపీ స్తానం నుంచి పోటీ చేస్తున్న సినీ న‌టుడు, వ్యాపార‌వేత్త‌ మాగంటి ముర‌ళీ మోహ‌న్ ఈ ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి త‌న కోడ‌లు రూపాదేవికి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే, ఆమె కూడా గ‌డిచిన రెండేళ్ల కాలం నుంచి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా ముందుకు క‌దిలారు.

అదేస‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రినీ క‌లు పుకొని పోయారు. చిన్న చిన్న మండ‌లాల్లోనూ ప‌ర్య‌టించి తాగునీరు, ఇంటింటికీ మ‌రుగుదొడ్డి నిర్మాణం, ప్ర‌తి స‌మ‌స్య ను ప‌రిష్క‌రించే వ్యూహంతో ముందుకు క‌దిలారు. దీంతో ప్ర‌తి విష‌యంలోనూ మాగంటికి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక‌, ఇప్పుడు కూడా భారీ ఎత్తున ప్ర‌చారానికి క‌దిలిన రూప‌కు మ‌హిళ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అటు మాగంటి బాబు, ఇటు మాగంటి రూప‌ల‌కు ల‌క్ష పైచిలుకు ఓట్ల మెజారిటీ ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.