షాకింగ్ : టీడీపీకి మాగుంట రాజీనామా.. చేరిన వెంటనే వైసీపీకి బిగ్ షాక్

టీడీపీకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. అనుచరులతో సమావేశం అనంతరం వైసీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నానని మాగుంట చెప్పారు. చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందని, పార్టీలో చంద్రబాబు అన్ని రకాలుగా సహకరించారని మాగుంట వ్యాఖ్యానించారు. ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని మాగుంట శ్రీనివాసులరెడ్డి చంద్రబాబును కొనియాడారు.

అయితే.. టీడీపీని వీడిన నేతలు చంద్రబాబుపై, పార్టీపై విమర్శలు చేసి మరీ వెళుతుంటే మాగుంట మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి మాగుంట ప్రశంసించడంతో వైసీపీ షాక్‌కు గురైంది. వైసీపీకి మాగుంట వ్యాఖ్యలు మింగుడు పడని పరిస్థితి కనిపిస్తోంది.