మ‌ళ్లీ గెలిచేది నిలిచేది అత‌డే నో డౌట్… ఎందుకంటే

మొద‌టి సారి ఎన్నిక‌యిన ఎమ్మెల్యే ఆయ‌న‌. మొద‌టి సారి అనే మాట‌కు వ‌న్నె తెచ్చేలా ప‌నిచేసిన చేస్తున్న వ్య‌క్తి ఆయ‌న. ఆయ‌నే ఆమ‌దాల‌వ‌లస ఎమ్మెల్యే కూన ర‌వి కుమార్‌. తెలుగుదేశం పార్టీకి ఈ యువ‌కిశోరం ఇప్పుడెంతో అవ‌సరం. నిబ‌ద్ధ‌త ఉన్న నేతగా ఆయ‌న పేరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సుప‌రిచితం.ఓ చిన్న స్థాయి నేత గా ఆరంభం అయిన ఆయ‌న త‌రువాత అన‌తి కాలంలోనే రాజ‌కీయ ఉద్దండుల‌ను ఎదుర్కొన్నారు.ఆమ‌దాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌గ్రాభివృద్ధికి పాటుప‌డుతున్నారు. త‌న వారికే కాదు అందరికీ ప‌దవులు ద‌క్కించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవ‌లం ప‌ద‌వుల విష‌య‌మే కాక పార్టీ నిర్మాణానికి ఆయ‌నెంత‌గానో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆమ‌దాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న నాలుగు మండ‌లాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల‌తో గ్రామీణ ర‌హ‌దారుల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్టించారు…

ఇంకా నిన్న‌మొన్న‌టి వేళ సాక్షి రాసిన‌ట్లు నియోజ‌క‌వ‌ర్గంలో కూన ర‌వికుమార్ పై అస‌మ్మ‌తి ఉంద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం. ఆయ‌న అందరివాడు.అజాత శ‌త్రువు.. పార్టీ నిర్మాణ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్న సైనికుడు. కేవ‌లం తాను బాగుంటే చాలు అనుకునే వ్య‌క్తి కానే కాదు అన్న‌ది ఆయ‌న స‌న్నిహితుల మాట. రానున్న కాలంలోనూ గెలిచేది ఆయ‌నేన‌ని ఇందులో ఎటువంటి సందేహాల‌కు తావే లేద‌ని, వైసీపీ నేతలు టీడీపీకి ఇవాళ వ‌స్తున్నారంటే అదంతా ఆయ‌న నాయ‌క‌త్వ ప‌ఠిమేన‌ని, ఇందులో రెండో ఆలోచ‌న‌కు తావేలేద‌ని ఆయ‌న అనుచ‌రులు చెబ‌తున్న మాట..
సాక్షి రాస్తున్న‌ట్లు చేరిక వ‌ల్ల పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని, ఇక ఆయ‌న సోద‌రుడి (కూన కృష్ణారావు)గురించి కూడా ఏవేవో అవాకులూ చెవాకులూ రాసింద‌ని అది కూడా స‌మంజ‌సం కాద‌ని పేర్కొన్నారు కూన స‌న్నిహితులు. ముఖ్యంగా ఆయ‌న ఎ1 కాంట్రాక్ట‌ర్ అని రాజ‌కీయాల్లోకి రాక మునుపే కూన ర‌వి సోద‌రుడు కాంట్రాక్ట‌ర్ గా ఎన్నో ప‌నులు చేప‌ట్టి ప్ర‌భుత్వ పెద్ద‌ల మ‌న్న‌న‌లు అందుకున్నార‌ని కేవ‌లం పొందూరు పీఏసీఎస్ చైర్మ‌న్ ప‌ద‌వి అందుకున్న మాత్రాన ఆయ‌న‌కు పెద్ద‌గా ఒన‌గూరిందేమీ లేద‌ని, అయినా కేవ‌లం ప‌ద‌వుల‌న్నింటినీ సొంత ఇంటి వారికే కేటాయిం చార‌ని చెప్ప‌డం వెనుక వాస్త‌వం ఎంత‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలుసు అని అన్నారు.

ఒక్క‌సారి ప‌ద‌వుల కేటాయింపు చూస్తే ఆమ‌దాలవ‌లస పీఏసీఎస్ చైర్మ‌న్ ప‌ల్లె భాస్క‌ర‌రావు ( కాపు)తో ప‌లువురికి నామినేటెడ్ పోస్టుల ద‌క్క‌డంలో కూన ర‌వి త‌న‌వంతు కృషి చేశారు.ఈ విష‌య‌మై సాక్షి రాసిన రాత‌ల్లో ఏమాత్రం నిజం లేదు స‌రికదా ర‌వి ని టార్గెట్ చేసుకుని రాసిన ఈ రాత‌లు నీటిమీద రాత‌గానే ఈ వార్త‌లు మిగిలిపోవ‌డం ఖాయం. ప‌ద‌వుల కేటాయింపులో సొంత సామాజిక‌వ‌ర్గంతో స‌హా కాపు బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గాల‌కూ ఆయ‌న ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలో లీడింగ్ క‌మ్యూనిటీలుగా పేర్కొనే కాపు కాళింగ‌తో స‌హా ఇత‌ర సామాజిక‌వర్గాలు కూడా ఇవాళ కూన ర‌వి నాయ‌క‌త్వాన్నిఎంత‌గానో స‌మ‌ర్థిస్తున్నాయి.మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. కూన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే రాత‌లు ఎన్ని వచ్చినా…ప‌బ్లిక్ లో ఆయ‌న చ‌రిష్మాకు తిరుగేలేదు.. ముఖ్యంగా నారాయ‌ణ పురం ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌తో ఒక్కసారిగా ఆయ‌న పేరు జిల్లా అంత‌టా మారుమోగిపోయింది. ప‌నులు పూర్తికావ‌డంతో ఇవాళ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు రెండో పంట‌కు నీరు అందుకోగ‌లుగుతున్నారు.క‌నుక ఈ సారి కూడా గెలిచి తీరేది కూన‌నే.. అందులో ఎటువంటి సందేహాల‌కూ అనుమానాల‌కూ తావేలేదు..