మాట నిల‌బెట్టుకుని ఓటు అడుగుతున్న ‘ ఏలూరి ‘ …

చిన‌గంజాం..పెద్ద‌గంజాం ఆ చుట్టూ ప‌క్క‌ల ఉన్న ప్ర‌జ‌ల‌కు 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఏలూరి ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. రొంపేరు వాగుపై బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసి వారిని త‌న‌కు ఓటు వేయాల‌ని కోరుతున్నాడు. ఇచ్చిన మాట ప్ర‌కారం..ప‌ని చేసి పెట్టాను..ఇప్పుడు న‌న్ను గెలిపించే బాధ్య‌త మీదంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు. చినగంజాం, పెద‌గంజాం కొడూరి పాలెం, పాత గొల్ల‌పాలెం, కొత్త‌గొల్ల‌పాలెం త‌దిత‌ర గ్రామాల్లో ఏలూరి నిర్వ‌హించిన ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. చిన‌గంజాం నుంచి ఆయ‌న నిర్మించి ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ఎన్టీఆర్ వార‌ధిపై న‌డుస్తూ పెద‌గంజాం చేరుకున్నారు. 7ద‌శాబ్ధాల క‌ల నెర‌వేర్చిన ఏలూరికి ప్ర‌జ‌లు అడుగ‌డుగునా ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. స్థానిక ప్ర‌జ‌లు ఆయ‌న‌పై పూల వ‌ర్షం కురిపించారు. ఎదురువ‌చ్చి మ‌రీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

చిన‌గంజాం..పెద‌గంజాంల మ‌ధ్య ఎన్టీఆర్ వార‌ధి నిర్మాణంతో 20కిలోమీట‌ర్ల అద‌న‌పు తిరుగుడు త‌ప్పింద‌ని స్థానికులు సంతోష‌ప‌డుతున్నారు. మిమ్మ‌ల్ని గెలిపించ‌డం మా గెలిపించ‌డం మా బాధ్య‌త… బంగారు భ‌విష్య‌త్‌కు నాంది అంటూ ప్ర‌చారంలో ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి జ‌నం చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌చారంలో ఏలూరి వైసీపీ అక్ర‌మాల‌ను, కుటిల నీతిని ఎండ‌గ‌డుతున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై 15అవినీతి కేసులున్నాయ‌ని, ప‌ర్చూరులో ఏమో అవ‌కాశ‌వాద వాది అభ్య‌ర్థిగా నిల్చున్నార‌ని విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అవ‌కాశ వాది కావాలా..? అభివృద్ధి చేసే నేత కావాలా అంటూ జ‌నం చేతే త‌న పేరును ఖ‌రారు చేసుకుంటుండం గ‌మ‌నార్హం.

ఇక ద‌శాబ్ధాల పాటు మంత్రి హోదాలో కొన‌సాగిన నేత‌లు కూడా నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేయ‌లేక‌పోయార‌ని, కాని ఏలూరి మాత్రం కేవ‌లం ఒక్క‌మారు ఎన్నికై చెప్పిన ప్ర‌తీ ప‌నితో పాటు ఇవ్వ‌ని అనేక హామీల‌ను సైతం నెర‌వేర్చి మ‌న‌ల్ని అభివృద్ధి బాట ప‌ట్టించార‌నే అభిప్రాయం జ‌నంలో స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతుండ‌టం విశేషం. ఇక జ‌నంలో ఇప్ప‌టికే స్థానిక అభ్య‌ర్థి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర్లు, వైసీపీపై ఈసడింపులు పెరిగాయి. ద‌గ్గుబాటి దంప‌తులు చేస్తున్న అవ‌కాశవాద రాజ‌కీయాల‌ను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తిట్టిపోస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఏలూరికి రోజురోజుకు మ‌ద్ద‌తు పెరుగుతుండ‌గా వైసీపీలో మాత్రం ఆందోళ‌న క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం ఏలూరి సొంతమైన‌ట్లేన‌ని తెలుస్తోంది.