యువ‌త, విద్యార్థి ఓట్ల‌పై మంత్రి గంటా వ్యూహం స‌క్సెస్‌…!

మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ఆయ‌న ఎక్క‌డ ఉన్నా సంచ‌ల‌నమే. ఏ ప‌ద‌వి ఇచ్చినా సంచ‌ల‌న‌మే. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. సంచ‌ల‌న‌మే! ప్ర‌స్తుతం విశాఖ జిల్లా భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. టీడీపీలో కీల‌క‌మైన స్థానం కేటాయించారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న‌ ప్ర‌భుత్వంలో అత్యంత కీల‌క‌మైన మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌ను కేటాయించారు. రాష్ట్రంలోని పాఠ‌శాల‌, క‌ళాశాల‌, విశ్వ‌విద్యాల‌యాల‌కు సంబంధించిన అన్ని విష‌యాల‌ను ఈ శాఖ‌కింద‌కే చేర్చారు. అదే స‌మ‌యంలో తెలంగాణా నుంచి విడిపోయిన నేప‌థ్యంలో అక్క‌డ ఏపీ విద్యాసంస్థ‌ల‌ను ఏపీకి మార్చే విధానం, నిధులు రాబ‌ట్టే బాధ్య‌త‌ల‌ను కూడా మంత్రి గంటాకే అప్ప‌గించారు

ఈ బాధ్య‌త‌ల‌ను మంత్రి గంటా నిజాయితీతో నిర్వర్తించారు. స‌మ‌ర్ధంగా వాటిని రాబ‌ట్టారు. దీంతో ఆయ‌న హ‌వా ప్ర‌భుత్వం లో భారీ ఎత్తున పెరిగింది. ముఖ్యంగా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో త‌న ప‌రిధిలో టీడీపీ ఓటు బ్యాంకును పెంచేందుకు మంత్రి గంటా వినూత్న శైలిలో ప్ర‌య‌త్నించారు. గ‌డిచిన ఆరు మాసాల కింద‌టే.. వ‌యోజ‌నులైన విద్యార్థులు, యువ‌త ఓట్ల‌ను టీడీపీకి ప‌డేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ఈ క్ర‌మంలోనే జ్క్షాన భేరి కార్య‌క్ర‌మానికి , నిరుద్యోగుల‌కు పింఛ‌న్ వంటి కీల‌క ప‌థ‌కాలు ప‌ట్టాలు ఎక్కేలా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం నిరుద్యోగ భృతిని రాష్ట్రంలోని అర్హులైన వారంద‌రికీ అందించ‌డం ద్వారా వారి ఓట్ల‌ను టీడీపీకే ప‌డేలా గంటా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించారు.

అదే స‌మ‌యంలో నిరుద్యోగుల‌కు క‌ల‌గా మారిపోయిన డీఎస్సీ వంటి ఉద్యోగ ప్ర‌క‌ట‌న చేసి భారీ ఎత్తున ఖాళీల‌ను భ‌ర్తీ చేసేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లారు గంటా. ఇదే జ‌రిగితే.. రాష్ట్రంలో రెండుల‌క్ష‌ల మందికి ప్ర‌భుత్వ కొలువులు ఖాయంగా వ‌స్తాయి. దీనిని ఎన్నిక‌ల‌కు ముందుగా నిర్ణ‌యించ‌డంలోనూ గంటా వ్యూహం స‌క్సెస్ అయింది. వీరంతా టీడీపీ ప్ర‌భుత్వం చేసిన మేలు మ‌రిచిపోయే ప్ర‌స‌క్తేలేద‌ని గంటా చెబుతున్నారు కూడా. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని యువ‌త ఓట్లు మొత్తంగా టీడీపీకి ప‌డ‌తాయ‌ని అంటున్నారు అదే స‌మ‌యంలో వినూత్న క‌ళాల‌ల‌ను ఏపీకి ర‌ప్పిస్తున్నారు. కేంద్ర సంస్థ‌ల‌ను ఏపీలో ఏర్పాటు చేసేలా చూస్తున్నారు. ఇవి కూడా అటు ఉపాధ్యాయ‌, ఇటు విద్యార్థుల ఓట్ల‌ను టీడీపీకి పాజిటివ్ చేసేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.