నాగ‌శౌర్య‌ను తొక్కేస్తోందెవ‌రు… అంతా ఆమే చేసిందా..!

టాలీవుడ్‌లో ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి క్రేజ్ మామూలుగా లేదు. ఆమె ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌నే డిమాండ్ చేసే స్థాయిలో ఉంది. ఆమె త‌ల‌బిరుసు త‌నంతో కొంద‌రు యంగ్ హీరోల‌ను బాగా ఇబ్బంది పెడుతోంద‌న్న టాక్ కూడా ఆమెపై ఉంది. ఆమెతో సినిమాలు చేసిన వ‌రుణ్‌తేజ్‌, నాని, తాజాగా నాగ‌శౌర్య కూడా చాలా ఇబ్బందులు ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఫిదా టైంలో వ‌రుణ్‌తేజ్ ఇబ్బంది ప‌డ్డాడు.

ఇక ఎంసీఏ సినిమా షూటింగ్ టైంలో నాని ఆమెతో వేగ‌లేక షూటింగ్ మ‌ధ్య‌లో వెళ్లిపోతే చివ‌ర‌కు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు జోక్యం చేసుకోవ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. ఇక ఇప్పుడు క‌ణం సినిమా విష‌యంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యిందంటున్నారు. ఈ సినిమా మొదలైనప్పటినుండే నాగ సౌర్య, సాయి పల్లవి గురించిన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాడు. సినిమాలో నాగ‌శౌర్య‌కు, సాయిప‌ల్ల‌వికి ముందు నుంచి ప‌డ‌డం లేద‌న్న టాక్ ఉంది. సాయి ప‌ల్ల‌వి ప్ర‌తి విష‌యంలోనూ నాగ‌శౌర్య‌ను డామినేట్ చేస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

దీంతో నాగ‌శౌర్య సాయి ప‌ల్ల‌విపై ప‌బ్లిక్‌గానే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాడు. ఇప్పుడు నాగ శౌర్య‌ను ఆ సినిమా ప్రమోషన్స్ నుండి పూర్తిగా తప్పించేసి సాయి పల్లవిని హైలెట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. సినిమా పోస్టర్స్ దగ్గరనుండి…. ఆడియో లాంచ్ వరకు సాయి పల్లవితోనే ప్రమోట్ చేయిస్తూ నాగ‌శౌర్య‌ను తొక్కేస్తున్నార‌న్న టాక్ ఉంది. ఇక సాయి ప‌ల్ల‌వి నాగ‌శౌర్య‌పై ఫైర్‌తో అత‌డిని పిలవనివ్వకుండా దర్శక నిర్మాతలను ఆడిస్తుందనే టాక్ వినబడుతుంది. ఇదంతా సాయి పల్లవి కావాలనే చేస్తోంది అంటున్నారు.