‘మహానాయకుడు’లో ఎన్టీఆర్‌గా నారా దేవాన్ష్

‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఇప్పటికే విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఇక రెండో పార్ట్ ‘మహానాయకుడు’ విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ముఖ్యంగా చూపించనున్నారు.

అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పోషించినట్టు సమాచారం. అలాగే ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ కూడా నటించినట్టు తెలుస్తోంది. దేవాన్ష్‌కి సంబంధించిన షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితం పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.