న‌ర‌సాపురం ప్ర‌జ‌ల పెద‌వి విరుపు: ఆ రెండు పార్టీలు వ‌ద్దు.. టీడీపీ ముద్దు

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు వేస్తున్న ఎత్తులు, జిత్తులు అన్నీ కావు. అధికారంలోకి రావ‌డం, గెలుపు గుర్రం ఎక్క డ‌మే ల‌క్ష్యంగా నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. ఏం చేసైనా స‌రే.. తాము విజ‌యం సాధించాలి. అనే ల‌క్ష్యంతో పార్టీ లు నాయ‌కులు కూడా దూసుకుపోతున్నారు ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎలాంటి వారు? ఎవ‌రు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉ న్నారు? ఎవ‌రు ప్ర‌భుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి బాట‌లు ప‌రిచింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్ర‌తి ఒ క్కరినీ క‌లుపుకొని పోతూ.. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే నాయ‌కుడు ఎవ‌రు? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌స్తోం ది. వ‌చ్చి పోయే నాయ‌కులు ఎంద‌రు ఉన్నా ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా సాయం చేసేవాడు, ప్ర‌జ‌ల‌కు అన్ని విధంగా అండ‌గా ఉండే వారు ముఖ్య‌మ‌నే విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో హాట్‌టాపిక్ మారిన నియోజ‌క‌వ‌ర్గంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం. ఇక్క‌డ నుంచి భారీ ఎత్తున పోటీ జ‌రుగుతోంది. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీతోపాటు అత్యంత కీలంగా ఇక్క‌డ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన కూ డా దూసుకుపోతోంది. అదేస‌మ‌యంలో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డం కూడా ప్ర‌తి పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. వైసీపీ త‌ర‌ఫున ముదినూరి ప్ర‌సాద‌రావు, టీడీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు వ‌ర్గానికి చెందిన బండారు మాద‌వ నాయు డు, ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున మ‌త్స్య‌కార వ‌ర్గానికి చెందిన బొమ్మిడి నాయ‌క‌ర్‌లు పోటీ చేస్తున్నారు. న‌ర‌సాపురం నియ‌జ‌క వ‌ర్గంలో కాపు వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతోపాటు ఇక్క‌డ మ‌త్స్య కార వ‌ర్గం ప్ర‌భావం కూడా అంతే ఎక్కువ‌గా ఉంది. ఇక్క డ వీరి ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం.

దీంతో ఇక్క‌డ ఇటు వైసీపీ, అటు జ‌న‌సేన నాయ‌కులు త‌మ‌కే ఓట్లు ప‌డ‌తాయ‌ని, త‌మ గెలుపే ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. సామాజిక వ‌ర్గాలే ప్ర‌బావం చూపుతాయ‌ని భావిస్తుండ‌డంతో వీరి వాద‌న‌కు బ‌లం చేకూరు తున్నా .. ప్ర‌జ‌లు మాత్రం జ‌రిగిన అభివృద్ధిని కూడా చూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బండారు.. మ‌త్స్యకారం సంక్షేమానికి పెద్ద‌పీట వేశారు. అభివృద్దిని త‌న కులంగా, మ‌తంగా మార్చుకుని నియోజ‌క‌వ‌ర్గాన్ని తీర్చి దిద్దారు. న‌ల్లిక్రీక్‌, ఫిషింగ్ హార్బ‌ర్ ఏర్పాటు వంటి అంశాల‌ను కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ముందుకు సాగారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌టి నినాదంతో ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రించారు. దీంతో వాస్త‌వానికి మ‌త్స్య‌కారుల్లోనూ బండారుకు సానుభూతి ఉంది. అయితే, వైసీపీ, జ‌న‌సేన‌లు మాత్రం మైండ్ గేమ్‌కు తెరదీయ‌డం గ‌మ‌నార్హం.