ఇండియాలో కొత్త సెక్స్…ఏంటో తెలుసా ?

రోజు రోజుకు మాన‌వ‌జీవితంలో పెనుమార్పులు సంభ‌విస్తున్నాయి. ఈ రోజు వింత‌గా ఉన్న‌ది రేప‌టికి పాత‌ద‌వుతోంది. మ‌నం చేసే ప‌ని నుంచి వాడుతున్న వ‌స్తువులు, వేష‌, భాష‌, ఆహార్యం ఇలా అన్నింటిలోను విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నాలుగు గోడ‌ల మ‌ధ్య ఏకంగాతంగా జ‌రిగే సెక్స్ విష‌యంలోనే అనేక మార్పులు వ‌స్తున్న‌ట్టు తాజా సర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడంతో ప్ర‌పంచంలో ఏ మూల ఏ క్ష‌ణాన ఏం జ‌రిగిందో క్ష‌ణాల్లో తెలిసిపోతోంది.

మెట్రో న‌గ‌రాల్లో ఈ సెల్ఫ్ ఫోర్న్ పోక‌డ‌లు ఇప్పుడు మాన‌వ‌జీవ‌నాన్ని వినాశ‌క‌ర‌దిశ‌గా న‌డుపుతున్నాయి. ఏకాంతంలో జీవితభాగస్వామితో జరిపే శృంగారాన్ని సెల్ ఫోన్లో బంధించటం.. అవి అనుకోని రీతిలో బయటకు వెళ్లిపోవటంతో పలు జంటలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. తాజాగా ఇండియాటుడే చేసిన స‌ర్వేలో ప్రతి ఐదు జంటల్లో ఒక జంట తమ శృంగార దృశ్యాలను స్మార్ట్ ఫోన్లో షూట్ చేసుకుంటున్నట్లుగా అంగీకరిస్తున్నార‌ట‌. అయితే ఆ త‌ర్వాత ఇవి అనుకోకుండా వేరే వాళ్ల చేతుల్లోకి చేరిపోవ‌డంతో ఇప్పుడు తీవ్ర‌మ‌నోవేద‌న‌తో చచ్చిపోతున్నార‌ట‌.

స‌రికొత్త సెక్స్….అదే క్యాజువ‌ల్ సెక్స్‌:
ఇక ఇండియాలో గ‌త ద‌శాబ్ద‌కాలంలో మెట్రో న‌గ‌రాల్లో స‌రికొత్త సెక్స్ ఆవిర్భ‌వించిన‌ట్టు ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. గడిచిన పదేళ్ల‌లో మెట్రో నగరాల్లో క్యాజువల్ సెక్స్ పెరిగినట్లుగా బయటకు వచ్చింది. మెట్రో నగరాల్లో 41 శాతం మంది యువకులు.. 29 శాతం మంది యువతులు ఎవ‌రో ఒక‌రితో ఓ రాత్రి ఎంజాయ్ చేసేందుకు, కొత్త అనుభ‌వం పంచుకునేందుకు రెడీగా ఉన్నార‌ట‌. ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరులోని నగరాల్లో ప్రతి ఏడుగురిలో ఒకరు తమకు పరిచయం లేని వారితో ఒక రాత్రి గడిపినట్లుగా అంగీకరించారని వెల్లడించారు.

ఇలాంటి కొత్త త‌ర‌హా సెక్స్‌లు, కోరిక‌ల వ‌ల్ల దాంప‌త్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు వ‌చ్చి, సంసారాలు విచ్ఛిన్న‌మ‌వుతాన్న‌య‌న్న‌ది కూడా అంగీక‌రించాల్సిన స‌త్యం. మ‌రి ఈ పోక‌డ‌లు ఫ్యూచ‌ర్‌లో మ‌రింత‌గా కొత్త‌పుంత‌లు తొక్కుతాయ‌న‌డంలో సందేహం లేదు.