సంచలనం : నిన్న వైసీపీలోకి.. నేడు టీడీపీలోకి..!

కావలి రూరల్‌ మండలం ఆముదాలదిన్నె పంచాయతి కొన దిన్నెకు చెందిన పంచాయతి మాజీ ఉపాధ్యక్షుడు జంపాని తిరుపాలు ఆదివారం తిరిగి పార్లమెంటు అభ్యర్థి బీద మస్తాన్‌రావు సమక్షంలో టీడీపీలోకి వచ్చారు. టీడీపీకి చెందిన తిరుపాలు కావలి పట్టణ కేతిరెడ్డి రామకోటారెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. రామకోటారెడ్డి కౌలు విషయం మాట్లాడదామని తిరుపాలును కావలికి పిలిపించి ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి వైసీపీ కండువా వేసినట్లు తిరుపాలు తనయుడు తిరుపతి, శీనయ్య, సుధ, వెంకయ్య తెలిపారు. దీంతో తిరిగి ఆయనను ఆదివారం కావలి పట్టణ టీడీపీ కార్యాలయానికి తీసుకువచ్చి బీద మస్తాన్‌రావు చేత టీడీపీ కండువా వేయించారు.