ఎన్టీఆర్ – రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో ఆమెకు ల‌క్కీ ఛాన్స్‌

టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నాడు. టాలీవుడ్‌లో నంద‌మూరి, మెగా ఫ్యామిలీల‌కు చెందిన ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇంత వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా వార్త‌లు మాత్రం నిజ‌మే అని అటు ఎన్టీఆర్‌, ఇటు చెర్రీ కాంపౌండ్‌ల నుంచి వ‌స్తున్నాయి.

ఇక ఈ మ‌ల్టీస్టార‌ర్‌ వార్తలను రాజమౌళి ఖండించకపోవంటంతో ఇదే రాజమౌళి నెక్ట్స్ సినిమా అని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు టైటిల్స్ కూడా ఇప్ప‌టికే ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. బాక్స‌ర్ అని, ఇద్ద‌రూ ఇద్ద‌రే అని కొన్ని పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ సినిమాలో చరణ్‌, ఎన్టీఆర్‌లు బాక్సర్‌లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ గా రాశీఖన్నాను ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న. గ‌తేడాది రాశీ ఎన్టీఆర్‌తో జై ల‌వ‌కుశ సినిమాతో హిట్ కొట్టి…. ఇటీవల తొలిప్రేమ సినిమాతో ఘనవిజయం అందుకుంది. ఈ ల‌క్కీ బ్యూటీకి ఇప్పుడు ఏకంగా జక్కన్న సినిమాలో ఆఫర్‌ అంటే గోల్డెన్‌ ఛాన్స్‌ అంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్టులో రాశీ న‌టిస్తే ఆమె కెరీర్ ఓ రేంజ్‌లో ట‌ర్న్ అవ్వ‌డం ఖాయ‌మే అని ఇండ‌స్ట్రీ టాక్‌.