ఏపీలో గాజువాక.. హాట్ టాపిక్‌… ‘ ప‌ల్లా ‘ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి విష‌య‌మూ వార్తే. ఎవ‌రు ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు? ఏ పార్టీ ఏనాయ‌కుడికి టికెట్ ఇ చ్చింది? ఏ నాయ‌కుడికి బ‌లం ఎంత ఉంది? ఎవ‌రు ఎక్క‌డ పుంజుకుంటున్నారు? అనే కీల‌క విష‌యాల‌పై నిత్యం ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటూనే ఉంటారు. ఇక‌, వీటికి తోడు.. ప్ర‌ముఖ నాయ‌కులు ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు? వారు గెలు స్తారా? లేదా? అనే విష‌యాలు కూడా చ‌ర్చ‌లో ప్ర‌ధాన భాగంగా మారాయి. ఏ ఇద్ద‌రు క‌లిసినా కూడా ఇదే చ‌ర్చించు కుం టున్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై స్టేట్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు? ఎవ‌రిపై పోటీ చేస్తున్నార‌నే విష‌యాలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌స్పెన్స్‌గా ఉన్నాయి.

అయితే, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం 25 రోజులు మాత్ర‌మే ఉండ‌డం, 18న అంటే మ‌రో రెండు రోజుల్లోనే నోటిఫికేష‌న్ జారీ కా నుండ‌డంతో జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌ను పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. తాను పార్ల‌మెంటుకు పోటీ చే యబోన‌ని గ‌తంలోనే వెల్ల‌డించిన ప‌వ‌న్‌.. అసెంబ్లీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక నుంచి ప‌వ‌న్ పోటీ చేస్తార‌ని తాజాగా వెల్ల‌డైంది. ఇక్క‌డైతే.. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండ‌డం, నాయ‌కులు కూడా క‌లిసిరావ‌డం వంటివి త‌న‌కు అనుకూలంగా మారుతుంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అయితే, ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు, గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ప‌ల్లా శ్రీనివాస‌రావు ఉన్నారు.

ఇక్క‌డ ప‌ల్లాకు సామాజిక‌వ‌ర్గ బ‌లంతో సంబంధం లేకపోయినా ప్ర‌జ‌ల్లో బ‌లం ఉంది. ప్ర‌జ‌ల్లో తిరుగులేని బ‌లం ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు సాధించారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతూ.. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తూ.. ముందుకు సాగారు. ఇలాంటి నాయ‌కుడికి ప్ర‌జ‌లు మ‌రోసారి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక‌, స్థానికంగా చేయించిన స‌ర్వేల్లోనూ.. ప‌ల్లాకు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. కాగా, ఇప్పుడు ప‌వ‌న్ ఎంట్రీతో నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి సారించింది. ప‌వ‌న్ రాక‌తో నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోతాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే, ప‌ల్లా ప్ర‌జాబ‌లం ముందు ప‌వ‌న్ ఢీ కొట్ట‌గ‌ల‌రా? అనే సందేహం కూడా తెర‌మీదికి వ‌స్తోంది. ఏదేమైనా.. ప‌వ‌న్ గాజువాక‌లో ఎంట్రీపై మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.