పవన్ కి బిగ్ షాక్ …. జనసేనకు కీలక నేత గుడ్ బై

జనసేన పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. పశ్చిమగోదావరి జిల్లా కోకన్వీనర్ యర్రా నవీన్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో.. పార్టీ నిర్ణయంపై ఆయన అసంతృప్తి చెంది రాజీనామా చేసినట్లుగా సమాచారం. పార్టీలో కష్టపడినవారికి కాకుండా.. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కనివారు జనసేనలో చేరితో వారికి టిక్కెట్లు ఇవ్వడం సరికాదని యర్రా నవీన్‌ వ్యాఖ్యానించారు.

కాగా ఇవాళ జనసేన ఆవిర్భావదినోత్సవ సభ రాజమండ్రిలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ నుంచి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. ఈ సందర్భంగా పవన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.