పేటలో రజనీకి వ్యతిరేకంగా ఒక్కటైన‌ ముస్లింలు… ఈ దాడులు త‌ట్టుకోలేం…!

చిలకలూరిపేట అంటే ప్రత్తిపాటి…ప్రత్తిపాటి అంటే చిలకలూరిపేట అనేలా….పేట ప్రజలకి ప్రత్తిపాటి పుల్లారావుతో అనుబంధం పెనవేసుకునిపోయింది. గత రెండు దశాబ్దాలుగా పేటలో పాగా వేస్తూ వస్తున్న ప్రత్తిపాటిని…ఈ సారి కూడా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయిన పుల్లారావు…నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి పేటలో పిల్లోడిని అడిగిన చెబుతాడు. కష్టం ఉందనే వచ్చే ప్రజలకి…ఎల్లప్పుడు అండగానే ఉంటారు. అందుకే ఇక్కడ ప్రజలు ప్రత్తిపాటిని తమ కుటుంబ సభ్యుడుగా చూస్తారు. ప్రత్తిపాటికి కూడా కులమతాలు పట్టింపు లేకుండా అందరినీ పేరు పెట్టె చనువు ఉంది.

అందుకే ప్రత్తిపాటి ఏ వూరులో ప్రచారం చేస్తున్న…అన్నీ వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఆయన చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలకి ఆకర్షితులై చాలామంది వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నటివరకు వైసీపీకి అండగా ఉన్న ముస్లింలు వైసీపీ అభ్యర్ధి విడదల రజనికి వ్యతిరేకంగా ఒక్కటై…. వేల సంఖ్య‌లో ప్రత్తిపాటి చెంతకి చేరుతున్నారు. అయితే వీరు ఇంతలా ప్రత్తిపాటి వైపుకు రావడానికి కారణాలు లేకపోలేదు. గతంలో పేటలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో…ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న వార్డ్స్ ఎక్కువ వైసీపీనే గెలుచుకుంది. అప్పుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో వైసీపీ నడిచేది. కానీ ఇప్పుడు రజని వచ్చాక వారిపై దాడులు పెరిగాయి. ఈ దాడులకు వ్య‌తిరేకంగా వారంతా ర‌జ‌నీ నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థించే ప‌రిస్థితుల్లో లేరు.

ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో రజనీ వర్గం ముస్లిం సోదరులని దారుణంగా కొట్టారు. పైగా వైసీపీ అధ్యక్షుడు జగన్…ఎప్పుడూ ముస్లింలని ఇబ్బంది పెట్టె బీజేపీతో చెలిమి చేస్తున్నారు. దీంతో పేటలో ముస్లింలు అంతా ప్రత్తిపాటివైపు వచ్చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇటీవల ముస్లింల మీద ప్రేమతో ప్రత్తిపాటి చిలకలూరిపేట మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా ఎస్ఎస్ సుభానినీ నియమించారు. అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పదవిని కూడా ముస్లింలకే ఇచ్చారు. ఇవేగాక ప్రత్తిపాటి ఈ ఐదేళ్లు ముస్లింలని అన్నీ రకాలుగా ఆదుకున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రజనీ నీచ రాజకీయాలకి మిగిలిన వర్గాలతో పాటు ముస్లింలు కూడా విసిగిపోయార‌న్న టాక్ ఆ వ‌ర్గాల్లోనే న‌డుస్తోంది. అందుకే నియోజకవర్గంలో ఉన్న ముస్లింలు ఆమెకు వ్యతిరేకంగా ఒక్కటై…తమకు అండగా నిలుస్తున్న ప్రత్తిపాటి వైపు వచ్చేస్తున్నారు. ఏది ఏమైనా రజనీకి బుద్ధి చెప్పడానికి…గతంలో వచ్చిన మెజారిటీ కంటే ప్రత్తిపాటిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ముస్లింసోద‌రులు చ‌ర్చించుకుంటున్నారు.