పేట‌పై చేతులెత్తేసిన వైసీపీ.. పుల్లారావుదే విజ‌యం

ఎన్నిక‌ల స‌మ‌రంలో ఎవ‌రు విజేత‌.. ఎవ‌రిది ప‌రాజ‌యం? అనే విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రో పాతిక రోజు ల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ వేడి రాజుకుంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారా నికి దూసుకుపోతున్నా కూడా.. గెలుపు గుర్రాల విజ‌యంపైనా అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంత‌మైన గుంటూరులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ప‌రిస్థితిపై స‌ర్వ‌త్రా సందేహాలు నెల‌కొన్నాయి. అధికార టీడీపీకి గుంటూరు కంచుకోట‌గా మారిన నేప‌థ్యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ తెలుగు త‌మ్ముళ్లు త‌మ స‌త్తా చాటుతు న్నారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అంటున్నారు.

మ‌రోప‌క్క‌, గుంటూరు నుంచి పోటీ చేయాల‌నే పార్టీకి ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ము ఖ్యంగా ఇప్ప‌టికే రేసు గుర్రాలుగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క‌మైన చ‌క్రం తిప్పుతున్న చోట మిగిలిన ప‌క్షాల‌ ప‌రిస్థితి మ రింత దారుణంగా త‌యారైంది. దీంతో వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందుగానే అదికూడా నామినేష‌న్లు వేయ‌కుండా ఓట‌మిని అంగీక‌రిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రోసారి అధికార పార్టీగా టీడీపీనే ఉండాల‌ని భావి స్తున్న ప్ర‌జలు ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. దీంతో వైసీపీకి ఎక్క‌డిక‌క్క‌డ ఎదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు మ‌రింత ఆస‌క్తిగా మారాయి.

పేట నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. ఒక‌ప‌క్క ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ ల్లోకి తీసుకు వెళ్ల‌డంతోపాటు.. విప‌క్షం వైసీపీ చేస్తున్న అనాలోచిత చ‌ర్య‌ల‌పైనా. ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌పైనా కూడా ప్ర‌త్తిపాటి విరుచుకుప‌డుతున్నారు.ఈ క్ర‌మంలో ప్ర‌త్తిపాటిని ఓడించాల‌ని నిర్ణ‌యించుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డ నుంచి ఎన్నారై మ‌హిళ‌, బీసీ వ‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీని రంగంలోకి దింపారు. దీంతో ఆమె ప్రత్తిపా టికి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున ర్యాలీలు కూడా నిర్వ‌హించినా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. కోట్ల రూపాయలు పంచి మ‌రీ రాజ‌కీయాల్లో స్థిర‌ప‌డాల‌ని భావించినా ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

దీంతో ఏ స‌ర్వే నిర్వ‌హించినా.. వైసీపీకి ఎడ్జ్‌లేద‌నే రిపోర్ట్ వ‌చ్చింది. దీంతో డోలాయ‌మానంలో ప‌డిన వైసీపీ అదినేత జ‌గ‌న్‌.. ఇక్క‌డ నుంచి పోటీకి ఇప్ప‌టికే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను మార్చారు. త‌ర్వాత విడ‌ద‌ల‌. ఇప్పుడు ఏకంగా ర‌జ‌నీ ప్లేస్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస‌రావును రంగంలోకి దింపాల‌ని చూస్తున్నారు. అయితే, ఇక్క‌డున్న వాతావ‌ర‌ణం మాత్రం పుల్లారావుకు అనుకూలంగా మార‌డంతో ప్ర‌స్తుతం ఇక్క‌డ నామినేష‌న్ల‌కు ముందుగానే వైసీపీ గుర్రం దిగేసిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఎన్నిక‌ల నాటికి పూర్తిగా చేతులు ఎత్తేసే ఛాన్స్ కూడా క‌నిపిస్తోంది.