రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ.. ఏపీలో పొత్తుపై క్లారీటి కోసమేనా…???

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమల వెంకన్న ప్రతిమను బాబు రాహుల్‌కు అందజేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో పొత్తు బెడిసి కొట్టడంతో టీడీపీ, కాంగ్రెస్ ఏపీలో పొత్తు పెట్టుకోవనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో పొత్తుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. బీజేపీపై పోరాటానికి పవన్ కలిసి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు… ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానన్న కాంగ్రెస్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.